Begin typing your search above and press return to search.

పవన్ ఒక బాహుబలి లాంటివాడు

By:  Tupaki Desk   |   13 May 2017 5:31 AM GMT
పవన్ ఒక బాహుబలి లాంటివాడు
X
పవన్ కల్యాణ్ ఈ పేరు వింటే అభిమానులుకు శివుడుకి ఢమరుఖం వింటే వచ్చే రేంజులో ఉంటుంది వాళ్ళ ఉద్వేగం. అతని మాటలు వాళ్ళకు లక్ష్మణ రేఖ.. అతని సందేశం వాళ్ళకు గీత. అటువంటి పవన్ కు బాహుబలికి కథ అందించిన విజయేంద్రప్రసాద్‌ వ్రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రభంజనం ఎంత వరుకు చేరుతుందో ఊహించుకోండి. విజయేంద్రప్రసాద్‌ రాజమౌళి సినిమాలుతో పాటుగా భజరంగీ భాయ్‌జాన్‌ అనే బాలీవుడ్ సినిమాకు కథ వ్రాసి అక్కడ కూడా సాహో అనిపించుకున్నారు. బాహుబలి2 ఘనవిజయంతో విజయేంద్రప్రసాద్‌ దేశంలో గొప్ప రచయతగా అవతరించారు.దానికి ఆధారంగా ఇప్పుడు మణికర్ణిక - ఝాన్సీలక్ష్మీబాయ్‌ జీవిత కథ చిత్రానికి రచయితగా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ వహిస్తున్నారు కంగనా ఝాన్సీలక్ష్మీబాయ్‌ గా నటిస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్‌ ఈ మధ్య పవన్‌ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి ది కంక్లూజన్’ ఇంటెర్వెల్ కు ముందు సన్నివేశం పవన్‌ అభిమానుల్ని తలుచుకొని రాసుకొన్నా అని చెప్పాడు. పవన్‌ నిజాయతీని, వ్యక్తిత్వాన్నీ తెగ మెచ్చుకున్నారు. నిజ జీవితంలో పవన్ ఒక బాహుబలి లాంటివాడు అని అన్నారు. మరి అలాంటి పవన్‌కి విజయేంద్ర ప్రసాద్‌ కథ సమకూరిస్తే ఎలా ఉంటుంది? ఈ విషయమే అతన్ని అడిగితే “ పవన్‌ కోసం కథ తప్పకుండా రాస్తా నాకు పవన్‌ తో కలసి పనిచేయాలిని ఉంది అన్నారు. 1000 కోట్ల విలువైన సినిమాని అందించిన విజయేంద్రప్రసాద్‌ పవన్‌ కోసం కథ రాయడానికి ఎదురుచూడం అభిమానుల్ని సంతోషపెట్టే విషయమే కానీ అతని కథకు సరిపడే డైరెక్టర్ ఒక్క రాజమౌళినే. మరి పవన్ సినిమాకు విజయేంద్రప్రసాద్‌ కథ మాటలు రాస్తే రాజమౌళి డైరెక్ట్ చేస్తే దాన్ని ఏమిని పిలవాలి...మనం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/