Begin typing your search above and press return to search.

బాహుబలి పెన్ తో ఇండో పాక్ లవ్

By:  Tupaki Desk   |   6 Feb 2018 11:05 AM IST
బాహుబలి పెన్ తో ఇండో పాక్ లవ్
X
సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయాలని చాలా మంది దర్శకులు వారి ఆలోచనలకు పదును పెడుతుంటారు. కానీ అన్ని ఐడియాలు క్లిక్ అవ్వాలంటే కొంచెం కష్టమే. అందరికి కొంచెం పరిచయం ఉన్న కథే అయినా కొత్తగా చూపిస్తే బెటర్ అని మరికొంత మంది దర్శకరచయిత లు ఆలోచిస్తున్నారు. ఇక ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఇండియా- పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు కొంచెం ఎక్కువగానే తెరకెక్కుతున్నాయి.

పూరి జగన్నాథ్ తన తనయుడితో రెండు దేశాల మధ్య జరిగిన అల్లర్ల నేపద్యంలో హిందు ముస్లిమ్ ప్రేమను చూపించబోతున్నడు. ఇక సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ కూడా దాదాపు అదే లైన్ తో ఒక హీరోని పరిచయం చేయబోతున్నాడు. ఇప్పుడు అదే తరహాలో బాహుబలి రచయిత విజేయేంద్ర ప్రసాద్ కూడా ఒక సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. మంచు వారి అబ్బాయితో ఇటీవల కథా చర్చలను జరిపిన ఆయన ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఒక హిందు అబ్బాయి పాకిస్థాన్ ముస్లిం అమ్మాయి మధ్య కొనసాగే ప్రేమ కథగా సినిమా తెరకెక్కనుందట. పాకిస్థాన్ లో ఉన్న తన ప్రేయసి కోసం హీరో అక్కడికి ఏ విధంగా వెళతాడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అని కాన్సెప్ట్ పై సినిమా మొత్తం సాగుతుందట. ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ పాకిస్థాన్ ఇండియా నేపథ్యంలో బజరంగీ భాయిజాన్ అనే కథను రాసిన సంగతి తెలిసిందే. ఆ కాన్సెప్ట్ జనాల్లోకి బాగా ఎక్కేసింది. మరి టాలీవుడ్ లో ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేయబోయే సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.