Begin typing your search above and press return to search.
హీరో - పొలిటిషియన్.. ఇలా అయ్యాడా.?
By: Tupaki Desk | 6 Sep 2018 11:48 AM GMTప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చాలా రోజులుగా చికిత్సి పొందుతున్న సంగతి తెలిసిందే.. కొంత కాలం నుంచి విజయ్ కాంత్ తరచుగా అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలోనే ఉంటున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన సమయంలోనూ విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యే అనారోగ్యం కాస్త తగ్గింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ కాంత్ నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఆందోళనగా నడుస్తూ మెరీనాబీచ్ లోని కరుణానిధి సమాధి వద్దకు వచ్చారు. అక్కడికి చేరుకొని సహాయకుల సాయంతో కరుణానిధి సమాధికి నివాళులర్పించారు. స్వతహాగా ఓ పార్టీ ఇన్ చార్జి అయినా కూడా విజయ్ కాంత్ కు కరుణానిధి అంటే చాలా ఇష్టం.. ఆయన చనిపోయినప్పుడు కనీసం నివాళులర్పించలేకపోయారు. అందుకే కరుణానిధి సమాధి వద్దకు రాగానే విజయ్ తట్టుకోలేక ఏడ్చేశాడు.
విజయ్ కాంత్ అనారోగ్యంతోనే ఆస్పత్రిలోనే ఉండడంతో పార్టీ కార్యకలాపాలను కొద్దిరోజులుగా ఆయన భార్య ప్రేమలత, ఆ పార్టీ సీనియర్ నేతలు చూసుకుంటున్నారు. కాగా చాలా రోజుల తర్వాత విజయ్ కాంత్ ను అంత దారుణమైన స్థితిలో చూసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. రియల్ హీరోలా ఉండే విజయ్ కనీసం నడవలేని స్థితి అలా ఉన్న వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్ గా మారింది. హీరో పరిస్థితి చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు.