Begin typing your search above and press return to search.
ఆ సినిమా ను ఫ్లాప్ చేసినందుకు కృతజ్ఞతలు : విజయశాంతి
By: Tupaki Desk | 14 Aug 2022 11:39 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ ఎత్తున విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ ను దక్కించుకుంది. సినిమా విడుదలకు ముందే ఆమీర్ ఖాన్ దేశ ద్రోహి అంటూ ఆయన నటించిన సినిమాను బ్యాన్ చేయాల్సిందే అంటూ బ్యాన్ లాల్ సింగ్ చడ్డా హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన విషయం తెల్సిందే.
తాజాగా ఈ విషయమై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ లో విజయశాంతి... లాల్ సింగ్ చడ్డా సినిమా ను నిషేదించాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
సినిమా ఫలితం ప్రజల ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలియజేస్తోంది. సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం జనాలు నిషేదించాలని డిమాండ్ చేయడమే అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
నార్త్ లో ప్రేక్షకులు సినిమాను బ్యాన్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో సౌత్ ఇండియాలో సినిమా ను విడుదల చేయాలని ఆమీర్ ఖాన్ భావించాడు. సౌత్ ఇండియన్ భాషల్లో కూడా లాల్ సింగ్ చడ్డా నిరాశే మిగిల్చింది. సినిమా ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసిన ప్రతి ఒక్కరి విజయంగా విజయశాంతి పేర్కొంది.
ఈ విజయం హిందూ సమాజంది మరియు బీజేపీ కార్యకర్తలది అన్నట్లుగా విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా లో ఆమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ఇంకా భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది.
బీజేపీ మరియు హిందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల లాల్ సింగ్ చడ్డా కు మినిమం వసూళ్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది.