Begin typing your search above and press return to search.
మహేష్ సినిమాలో విజయశాంతి..ఆరోపణలపై క్లారిటీ
By: Tupaki Desk | 3 Jun 2019 7:22 AM GMTసూపర్ స్టార్ కృష్ణ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. అనంతరం చిరంజీవి - బాలయ్య - నాగార్జున - వెంకటేశ్ ఇలా అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది.అనంతరం కర్తవ్యం లాంటి సినిమాలతో సోలో లేడీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది.
అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమైన రాములమ్మ 13 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఆమె రాజకీయాల్లో చేరి టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లో పనిచేశారు. పదవులు అలంకరించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ తరుఫున మొన్నటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్ పదవి చేపట్టి ప్రచారం కూడా చేశారు. అయితే 2014లో ఓడిపోయాక నాలుగేళ్లు మాత్రం పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించలేదు. సడన్ గా ఎన్నికల ముందర వచ్చి కాంగ్రెస్ లో హల్ చల్ చేశారు. కానీ 2019లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో రాములమ్మ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో వెళుతుండడంతో ఇక రాజకీయాలకు రాంరాం చెప్పినట్టేనే అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ కాడిని రాములమ్మ వదిలేసిందని విమర్శలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ ఆరోపణలు - అనుమానాలకు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తున్నందుకు చాలా మంది సంతోషించారని.. కానీ రాజకీయ నేతలు మాత్రం విమర్శించారన్నారు. తనకు 6 నెలల కిందటే ఈ ఆఫర్ వచ్చిందని.. స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో ఉండడంతో తాను చేయనన్నానని.. ఇప్పుడు ఫ్రీ కావడంతోనే చేస్తున్నానని వివరణ ఇచ్చారు. నాకు అప్పగించిన పార్టీ పని పూర్తయ్యాకే సినిమాల్లో నటిస్తున్నానని.. రాజకీయాలపై పూర్తి కమిట్ మెంట్ తో మొన్నటివరకు పనిచేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయాల్సిన అవసరం లేదని.. పార్టీలో ఉండి కూడా తాను చేశానని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి వెళుతున్న మాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదని విజయశాంతి పోస్ట్ చేశారు.