Begin typing your search above and press return to search.
నెం.1 డ్యాన్సర్ ఆయనొక్కరే -విజయశాంతి
By: Tupaki Desk | 9 May 2016 6:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి.. 1990ల్లో ఇదో క్రేజీ కాంబినేషన్. హీరోల్లో చిరంజీవికి - హీరోయిన్స్ లో విజయశాంతికి టాప్ రేంజ్ ఇమేజ్ ఉండేది. ఈ ఇద్దరూ కలిసి నటించే మూవీపై ముందునుంచే అంచనాలు పెరిగిపోయాయి. అలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కు ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఇప్పుడీ సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్లు పూర్తైంది.
కొన్ని విషయాల్లో చిరంజీవికి సాటి రాగల వ్యక్తులు ఇప్పటికీ లేరు అంటున్నారు లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి. 'డ్యాన్సులు చేయడంలో ఇప్పటికీ చిరంజీవిని ది బెస్ట్ అనాల్సిందే. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ ఆయన. చిరంజీవికి పోటీ రాగల వాళ్లు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ లేరు. ఈ తరంలో కొంతమంది హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నా.. చిరంజీవిలో ఉన్న స్పెషల్ స్టైల్ వీరిలో కనిపించదు. సొంతగా ఆయనకు ఉండే గ్రేస్ స్పెషల్ అస్సెట్.' అంటున్నారు విజయశాంతి.
అలాగే వ్యక్తిగా కూడా చిరు చాలా మంచి వారని చెప్పిన ఆమె.. గ్యాంగ్ లీడర్ కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి ఉత్తమనటి అవార్డు వచ్చినట్లు తెలిసిందట. ఆ సాయంత్రమే పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా పిలిచారట చిరు. ఓ హీరోయిన్ కు అవార్డు వస్తే ఈ స్థాయిలో అభినందించడం ఆయన్నే చూశానంటున్నారు విజయశాంతి.