Begin typing your search above and press return to search.
స్టార్ హీరో పుత్రోత్సాహం
By: Tupaki Desk | 25 Nov 2019 11:49 AM GMTతమిళంతో పాటు తెలుగులో స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న విక్రమ్ ప్రస్తుతం పుత్సోత్సాహంతో పొంగి పోతున్నాడు. ఎంత పెద్ద స్టార్ అయినా.. సూపర్ స్టార్ అయినా తన కొడుకు విజయాన్ని తన విజయం కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఇప్పుడు విక్రమ్ కూడా తనకు ఎన్నో సూపర్ హిట్స్ వచ్చినా కూడా వాటప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఆనందంగా ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. ఆయన కొడుకు ఆధిత్య వర్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్నాడు.
విక్రమ్ తన కొడుకు దృవ్ విక్రమ్ సినిమా ఎంట్రీ కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ తో దృవ్ ను హీరోగా పరిచయం చేయాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం మొదట బాలాతో రీమేక్ ప్లాన్ చేశాడు. కాని దర్శకుడు బాలా ఒరిజినల్ కు చాలా దూరంగా సినిమాను తెరకెక్కించడంతో పాటు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేదు అనే ఉద్దేశ్యంతో మొత్తం రీ షూట్ కు వెళ్లాడు. అందుకు అయిన ఖర్చు అంతా కూడా విక్రమ్ భరించాడు అంటూ అప్పుడు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.
రీ షూట్ సమయంలో చాలా వరకు దగ్గరుండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆధిత్య వర్మపై పూర్తి ఫోకస్ పెట్టి దర్శకుడికి సూచనలు ఇస్తూ చేయించాడట. విడుదల విషయంలో కూడా అన్ని విధాలుగా ఆలోచించి.. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనుకుని ఇటీవలే 22వ తారీకున విడుదల చేయించాడు. అర్జున్ రెడ్డి ఇప్పటికే తెలుగు మరియు హిందీలో హిట్ అయ్యింది. తాజాగా తమిళంలో కూడా ఘన విజయం సాధించింది.
ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాపై చాలా మంది అనుమానాలు పెట్టుకున్నారు. కాని ఆ అనుమానాలు అన్నీ కూడా పటాపంచలు చేస్తూ 'ఆధిత్య వర్మ' మంచి విజయాన్ని దక్కించుకుంది. దృవ్ కు మంచి పేరు రావడంతో పాటు భవిష్యత్తులో స్టార్ అవుతాడని.. విక్రమ్ కు తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే విక్రమ్ తన కొడుకు విషయంలో పుత్రోత్సాహంతో ఉన్నాడు. తన సినిమా విషయంలో కూడా తనకు ఇంత ఆనందం కలగలేదని.. ఆధిత్య వర్మ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లుగా సినిమా సక్సెస్ మీట్ లో విక్రమ్ అన్నాడు.