Begin typing your search above and press return to search.
తండ్రి కొడుకుల సినిమా అప్ డేట్
By: Tupaki Desk | 2 Oct 2020 4:15 AM GMTతమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు ఆయన తనయుడు ధృవలు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆధిత్య వర్మతో ప్రేక్షకులకు ఇప్పటికే హీరోగా పరిచయం అయిన ధృవ రెండవ సినిమాతోనే తండ్రితో కలిసి కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ కు వెళ్లలేదు. పరిస్థితులు కుదుట పడుతున్న ఈ సమయంలో షూటింగ్ కు వెళ్లేందుకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెడీ అవుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ సినిమా షూటింగ్ ను కొడైకెనాల్ లోని హిల్ వ్యాలీలో చేయబోతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమైన నటీనటులు మాత్రమే ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. విక్రమ్ 60వ సినిమా అవ్వడం వల్ల అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో విక్రమ్ విలన్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై స్పష్టత లేదు.
ధృవ హీరోగా విక్రమ్ విలన్ గా నటిస్తే సినిమా పై అంచనాలు భారీగా ఉండటం ఖాయం. తమిళంతో పాటు తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కనుక ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.