Begin typing your search above and press return to search.

ధృవతారతో పెళ్లిచూపులు భామ

By:  Tupaki Desk   |   16 July 2017 9:27 AM GMT
ధృవతారతో పెళ్లిచూపులు భామ
X
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్.. గత కొంతకాలంగా సరైన విజయం సాధించడంలో విఫలం అవుతున్నాడు. తన నటనతో అన్ని సినిమాలను మెప్పిస్తున్నా.. కమర్షియల్ సక్సెస్ విషయంలో మాత్రం వెనకబడుతున్నాడు. ప్రస్తుతం ధృవ నక్షత్రం అంటూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా విక్రమ్.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ధృవ నక్షత్రాన్ని ఓ స్పై థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఈ మూవీలో హీరోయిన్ గా మొదటగా కేరళ భామ అను ఇమాన్యుయేల్ ను తీసుకుని.. తర్వాత ఆమె ప్లేస్ లోకి తెలంగాణ బ్యూటీ రీతు వర్మకు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ధృవ నక్షత్రంలో.. రీతు వర్మ విక్రమ్ కు జోడీగా నటించనుంది. రీసెంట్ గా విక్రమ్- రీతువర్మలపై ఓ పాటను కీలక సన్నివేశాలను చిత్రీకరించగా.. ఈ షూట్ కి సంబంధించిన ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎప్పటి మాదిరిగానే విక్రమ్ మళ్లీ కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. హీరోయిన్లను ఎంతో అందంగా చూపించే గౌతమ్ మీనన్ మూవీ కావడంతో.. రీతు వర్మ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఇద్దరి ఏజ్ లోను గ్యాప్ కనిపిస్తున్నా.. పెయిర్ భలే క్యూట్ అనిపించేలా ఓ ఫోటోలు ఉండడం విశేషం. ఇప్పటికే తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకున్న రీతు వర్మ.. ధృవ నక్షత్రం సక్సెస్ అయితే.. తమిళ్ లో కూడా పాతుకుపోయే అవకాశాలున్నాయి.