Begin typing your search above and press return to search.

విక్రమ్ - రోలెక్స్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   6 Jun 2022 11:30 PM GMT
విక్రమ్ - రోలెక్స్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
X
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్'' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మా నగరం' 'ఖైదీ' 'మాస్టర్' వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ''విక్రమ్'' సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ లు కీలక పాత్రలు పోషించారు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు.

తెలుగులోనూ 'విక్రమ్' సినిమా సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. అద్భుతమైన కాస్టింగ్ తో అల్టిమేట్ క్రూతో దర్శకుడు లోకేష్ సృష్టించిన ఈ మల్టీవర్స్ డార్క్ వరల్డ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు అన్ని చోట్లా విక్రమ్ - రోలెక్స్ క్రేజ్ కనిపిస్తోంది.

రోలెక్స్ అనేది ఈ మూవీలో సూర్య పాత్ర పేరు. ఇందులో అగ్ర హీరో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అయితే అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా తక్కువ. చివర్లో కాసేపు అలా తళుక్కున మెరిశాడు. కానీ రోలెక్స్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు.

'విక్రమ్' సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. రోలెక్స్ గా సూర్య కనిపించిన కొన్ని నిముషాలు మరో ఎత్తు. గతంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'ఖైదీ' చిత్రానికి.. త్వరలో తీయబోయే 'ఖైదీ 2' మూవీకి లింక్ అన్నట్లుగా.. 'విక్రమ్ 3' సినిమాకి లీడ్ అన్నట్లుగా సూర్య పాత్ర ఉంటుంది.

సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో రోలెక్స్ గురించే మాట్లాడుతున్నారంటేనే.. దాని ప్రభావం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కమల్ - సేతుపతి - ఫాహాద్ అద్భుతమైన నటనకు తోడుగా సూర్య అతిధి పాత్ర కూడా జత కలవడం 'విక్రమ్' సినిమా ఘన విజయానికి కారణమని చెప్పొచ్చు.

సూర్య పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. దీనికి వచ్చే రెస్పాన్స్‌ ని బట్టి తన దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయని దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ - ఢిల్లీ - రోలెక్స్ - అమర్ లతో డైరెక్టర్ లోకేష్ మల్టీవర్స్ లో ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

ఇకపోతే 'విక్రమ్ హిట్ లిస్ట్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రూ. 12.25 కోట్లకు పైగా గ్రాస్ తో 6.55 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుని ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

తెలుగులో'విక్రమ్' సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై టాలీవుడ్ యువ హీరో నితిన్ రిలీజ్ చేశారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.