Begin typing your search above and press return to search.
బాలీవుడ్ మెగా ప్రాజెక్టులో విక్రమ్
By: Tupaki Desk | 8 Jan 2018 7:41 AM GMTఇప్పుడైతే విక్రమ్ వరుస ఫ్లాపులతో రేసులో బాగా వెనకబడిపోయాడు కానీ.. పదేళ్ల కిందట అతడి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అన్నియన్ (అపరిచితుడు).. సామి.. పితామగన్ (శివపుత్రుడు) లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ఇమేజ్ సంపాదించి సౌత్ ఇండియన్ బిగ్ స్టార్టలో ఒకడిగా ఉండేవాడు. ‘అపరిచితుడు’ హిందీ వెర్షన్ తో బాలీవుడ్లోనూ అతడికి పేరొచ్చింది. కానీ ఈ క్రేజ్ ను.. ఈ ఫాలోయింగ్ ను విక్రమ్ నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఐతే ఇలాంటి తరుణంలోనూ ఒక మెగా బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నాడు విక్రమ్.
మహాభారతంలో కీలక పాత్రధారి అయిన కర్ణుడి కథతో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమా ‘మహావీర్ కర్ణ’ సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నాడు విక్రమ్. ఈ చిత్రం ప్రధానంగా హిందీలో తెరకెక్కి.. తమిళం.. తెలుగు.. మలయాళ భాషల్లోకి కూడా అనువాదమవుతుంది. ఆర్.ఎస్.విమల్ అనే మలయాళ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రాన్ని ముందు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ తో చేయాలనుకున్న విమల్.. తర్వాత విక్రమ్ ను కథానాయకుడిగా ఎంచుకున్నాడు. న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీని బడ్జెట్ రూ.300 కోట్లని ప్రకటించడం విశేషం.
ఈ ఏడాది అక్టోబర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట. 2019 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. విక్రమ్ కూడా ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని ధ్రువీకరించాడు. కర్ణుడి పాత్ర కోసం హోమ్ వర్క్ చేయడంతో పాటు తన అవతారాన్ని మరోసారి పూర్తిగా మార్చుకోబోతున్నాడట విక్రమ్. ఈ సినిమాలో విక్రమ్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.