Begin typing your search above and press return to search.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతున్న 'విక్రమ్'?
By: Tupaki Desk | 20 Jun 2022 3:44 AM GMTకమలహాసన్ అంటేనే సాహసాలు .. ప్రయోగాలు. వాటిని గురించిన ప్రస్తావన కూడా ఆయన ఎక్కడా ఎక్కువగా తీసుకుని రారు. ఏ పాత్ర కోసం తాను ఎలాంటి కసరత్తు చేసిందీ .. ఎంతగా కష్టపడింది ఆయన ఎప్పుడూ చెప్పరు. అలాగే ప్రయోగాత్మక పాత్రల విషయంలో తన మేకప్ కోసం ఎన్ని గంటలు పట్టింది .. ఇలా ఇంకెవరూ చేయలేరు అనే తరహాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన సమాధానాలను ఆయన పాత్రలు మాత్రమే చెబుతాయి. అందువల్లనే కమల్ ను ప్రేక్షకులు ఇప్పటికీ అభిమానిస్తున్నారు .. ఆదరిస్తున్నారు.
అలాంటి కమల్ .. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న కమల్ .. మరోసారి ప్రయోగంతో కూడిన సాహసం చేశారు .. దాని పేరే 'విక్రమ్'. చాలా కాలం తరువాత తన సొంత బ్యానర్లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి భాషలోను .. ప్రతి ప్రాంతంలోను వసూళ్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. ఈ సినిమా తరువాత చాలా సినిమాలు థియేటర్లకు వచ్చినప్పటికీ, ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపలేకపోయాయి. ఇంకా ఈ సినిమాను గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
లోకేశ్ కనగరాజ్ కథాకథనాలు .. ఆయా పాత్రలలో ఆయన స్టార్స్ ను తీసుకోవడం .. ఆ పాత్రలను మలిచిన విధానం .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ను డిజైన్ చేసుకున్న తీరు. భారీ యాక్షన్ ను ఎమోషన్ చుట్టూ తిప్పడం వలన ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది.
అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలాంటివారికి ఈ సినిమా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ఓటీటీ హక్కులను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు తీసుకున్నారు. ఈ సినిమాను వారు జులై 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఈ సినిమా తన అప్పులన్నిటినీ తీర్చేసిందని కమల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఒక విశేషం. ఇకపై తన నుంచి లోకేశ్ కనగరాజ్ కి ఎలాంటి సహాయం కావాలన్నా ఉంటుందని చెప్పడం మరో విశేషం. ఇప్పటికే ఆయన లోకేశ్ కనగరాజ్ కి కోటి రూపాయల ఖరీదైన కారును కొనిపెట్టిన సంగతి తెలిసిందే.