Begin typing your search above and press return to search.
స్వపక్షపాతం `అర్ధంలేనిది` అంటూ కొట్టి పారేసిన అగ్రనిర్మాత
By: Tupaki Desk | 23 Sep 2020 12:30 AM GMTసమీప భవిష్యత్తులో కంగనా రనౌత్‌తో కలిసి పనిచేయడంపై తన ఆలోచనలను పంచుకున్న తరువాత, అగ్ర నిర్మాత విక్రమ్ భట్ చాలా ఎక్కువగా చర్చకు వచ్చిన `స్వపక్షపాతం`పైనా మనసు విప్పారు. దీనిని `అర్ధంలేనిది` అంటూ కొట్టి పారేశారు. అంతేకాదు.. ఆలియా భట్- రణబీర్ కపూర్ లాంటి తారలను తీర్చిదిద్దే బాధ్యత ప్రేక్షకులదేనని అన్నారు. స్వపక్షపాతం విజయానికి హామీ ఇవ్వదని అన్నారు.
ఒక తండ్రి తన కొడుకును స్టార్ ని చేయగలిగితే.. సన్నీ డియోల్ కొడుకు కరణ్ డియోల్ మొదటి చిత్రం `పల్ పల్ దిల్ కే పాస్` పరాజయం పాలయ్యేదే కాదు. ఈ చిత్రం బాగా ఆడకపోతే సన్నీ డియోల్ ఏం చేయగలిగాడు? అంటూ ప్రశ్నించారు భట్.
``అలియా భట్ .. రణబీర్ కపూర్ నటనను ప్రేక్షకులు మెచ్చుకోకపోతే వారు ఎప్పటికీ స్టార్లుగా మారరు. వారిని స్టార్లుగా మార్చడం ప్రేక్షకుల బాధ్యత. వారి తండ్రులు కాదు. వారి కుటుంబాల నుండి అవకాశం పొందిన అనేక మంది నటులు - దర్శకులు ఉన్నారు కానీ ప్రేక్షకులు వారి పనిని ఇష్టపడలేదు. అన్నిటినీ తిరస్కరించారు. స్వపక్షపాతం అనేది ఒక అర్ధంలేని చర్చ అని నేను నమ్ముతున్నాను, ఇది చాలాకాలంగా కొనసాగుతున్న అనేక ఇతర అర్ధంలేని చర్చల మాదిరిగానే ఉంది`` అని భట్ అన్నారు.
ఇలాంటి చర్చల్లో ఇతర రంగాలకు భిన్నంగా హిందీ చిత్ర పరిశ్రమ చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని విక్రమ్ భట్ అభిప్రాయపడ్డారు. ``ఒక రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు కావచ్చు. ఒక వ్యాపారవేత్త కొడుకు కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే అనుసరించవచ్చు. ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావచ్చు కానీ ఒక నటుడు కొడుకు నటుడు కాడు! మరి ఈ రంగంలో మేం చేసిన పోరాటాలు పడ్డ కష్టాలు మాకు ఉపయోగపడకూడదా? అయినా మేం కష్టపడి పనిచేయడానికి కారణం అదే`` అని కూడా అన్నారు.
``పాకిస్తాన్ తో సరిహద్దు వివాదం లేదా పోరాటం ఉంటే మా వారసత్వ ఆర్టిస్టులను ఆపివేయండి. ఎందుకంటే ఇది పెద్ద సౌండింగునే వినిపిస్తుంది. ఇక మనుషులు సిగరెట్ తాగడం విషయానికి వస్తే.. పాన్ బీడీ షాపులను మూసివేయమని ఉద్యమం చేయరు. కానీ సినిమాల నుండి ధూమపాన దృశ్యాలను తగ్గించండి. జంతు హక్కుల కార్యకర్తలకు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటూ ఇలాంటి ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తారు. మారథాన్ లో గుర్రాల పరుగు చూస్తారు కానీ.. గ్రామాల్లోని జంతువుల పరిస్థితి ఏమిటో ఎవరూ పట్టించుకోరు... అంటూ తనదైన శైలిలో పంచ్ లు వేశారు భట్ జీ.