Begin typing your search above and press return to search.

ఒకే హీరో- ఇద్దరు నిర్మాతల రిలీజ్ పోటీ!

By:  Tupaki Desk   |   21 Jun 2018 9:24 AM GMT
ఒకే హీరో- ఇద్దరు నిర్మాతల రిలీజ్ పోటీ!
X
ఒక హీరో ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించడం ఇప్పుడు విచిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా చియాన్ విక్రమ్ లాంటి మాస్ హీరో ఇలా చేస్తాడని అసలు అనుకోలేం. అంత వైవిధ్యంగా తన చిత్రాలలో పాత్రలతో మెప్పిస్తుంటాడు ఈ హీరో. కానీ ఒక సినిమా రిలీజ్ లేట్ కారణంగా.. ఇప్పుడు ఈయన నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన మూవీ ధృవ నక్షత్రం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి చాలా కాలమే అయింది కానీ.. రకరకాల రీజన్స్ తో వాయిదా పడుతూ.. ఇప్పటికి రిలీజ్ కి అన్ని రకాలు గాను సన్నద్ధమైంది. మరోవైపు విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ సామి స్క్వేర్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధమైంది. హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. కానీ ఇప్పుడీ రెండు సినిమాల నిర్మాతలు ఒకే సమయంలో రిలీజ్ కోసం పోటీ పడుతున్నారు. తమ సినిమా ముందు విడుదల చేస్తామంటే.. తమ సినిమాయే ముందు రావాలని పట్టుపడుతున్నారు.

ఆగస్ట్ రెండోవారంలో సినిమా రిలీజ్ కోసం అటు ధృవనక్షత్రం మేకర్స్.. ఇటు సామి స్క్వేర్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ఈ విషయంలో తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు విక్రమ్. ఎవరి వైపు మాట్లాడలేకుండా ఉన్నాడట. నిర్మాతలనే చర్చించుకుని డిసైడ్ చేసుకోవాలని.. తనకు ఏ సినిమా ముందు వచ్చినా సమస్య లేదని చెప్పాడట చియాన్ విక్రమ్.