Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ తిండి క‌ష్టాలు

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:30 PM GMT
విక్ర‌మ్ తిండి క‌ష్టాలు
X
చిన్న‌పుడు డ‌బ్బుల్లేక క‌డుపు నిండా తిన‌లేక‌పోయా.. ఆ త‌ర్వాత న‌టుడిగా ఫిజిక్ మెయింటైన్ చేయ‌డం కోసం క‌డుపు మాడ్చుకున్నా.. వ‌య‌సు మీద ప‌డ్డాక అనారోగ్యంతో తిన‌లేక‌పోతున్నా.. అంటూ అప్ప‌ట్లో ఓసారి మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌రరావు వాపోయారు. ఏఎన్నార్ అనే కాదు.. చాలామంది న‌టీన‌టులు సినిమాల కోసం క‌డుపు నిండా తిన‌రు. అందులోనూ పాత్ర‌ల కోసం ప్రాణం పెట్టేసే విక్ర‌మ్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నే ఉండ‌దు. సినిమా సినిమాకూ డిఫ‌రెంట్ లుక్ చూపించే విక్ర‌మ్.. క‌డుపు నిండా తిని చాలా ఏళ్ల‌యింద‌ట‌. స్వ‌త‌హాగా తాను భోజ‌న ప్రియుడిన‌ని.. బాగా తినేవాడిన‌ని.. ఐతే సినిమాల కోసం త‌క్కువ తిన‌డం అల‌వాటై.. ఇప్పుడు ఎక్కువ తిన్నా ప‌డ‌ని స్థాయికి చేరుకున్నాన‌ని విక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్వూలో చెప్పాడు.

‘‘నేను 15-20 చపాతీలు తినగలను. 25-30 ఇడ్లీలు లాగించ‌గలను. కానీ గడచిన పదీ పదిహేనేళ్లల్లో నా తిండి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఒకప్పటిలా ఇప్పుడు తింటే సరిపడటం లేదు. మామూలుగా ఒక్క గులాబ్ జాం.. ఒక ఐస్ క్రీం వ‌ల్ల ఎవరూ లావైపోరు. కానీ నేను సినిమాల కోసం క‌ఠిన‌మైన డైటింగ్ చేయ‌డం వ‌ల్ల ఒక్క గులాబ్ జాం తిన్నా బరువు పెరిగిపోతాను.ఎంత తక్కువ తిన్నా అది ఎక్కువైపోతోంది. అందుకే నేను ఎప్ప‌టికీ ఒక‌ప్ప‌ట్లా 20 చపాతీలు.. 30 ఇడ్లీలు తినలేనేమో’’ అని చెప్పాడు విక్ర‌మ్‌. మూడేళ్ల ముందు డైట్ విష‌యంలో మ‌రీ క‌ఠినంగా ఉండేవాణ్న‌ని.. కానీ ఈ మ‌ధ్య కొంచెం మారాన‌ని.. అప్పుడ‌ప్పుడూ త‌న కూతురు పిజ్జా తింటుంటే ఒక పీస్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నాన‌ని విక్ర‌మ్ చెప్పాడు.