Begin typing your search above and press return to search.
ఒకరు వేరే.. ఒకరు మాత్రం విక్రమే
By: Tupaki Desk | 5 Sep 2016 5:18 AM GMTస్వతహాగా తనకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం అని గతంలో 'ఓపెన్ హార్ట్' ప్రోగ్రామ్ లో హీరో విక్రమ్ చెప్పినట్లు మనం చెప్పుకున్నాం. మనోడు తమిళంలో వినీత్, అబ్బాస్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. తను స్టార్ అయ్యాక కూడా కంటిన్యూ చేశాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్న విక్రమ్ తన తెలుగు సినిమాలకు మాత్రం వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించుకోవడం విశేషం.
ఆ మధ్యన 'ఐ' సినిమాలో 'అంతకు మించి' అనే డైలాగ్ కోసం డబ్బింగ్ చెప్పిన విక్రమ్.. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి ఫీటే చేస్తున్నాడు. ఈ నెల 8న ''ఇంకొక్కడు'' సినిమాతో వస్తున్న విక్రమ్.. ఆ సినిమాలో రెండు పాత్రలను చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్రను.. అలాగే విలన్ గా లవ్ అనే సైంటిస్టు పాత్రనూ చేస్తున్నాడు. ఇందులో ఒక పాత్రకు మనోడు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడట. మరో పాత్రకు తెలుగు లోకల్ డబ్బింగ్ ఆర్టిస్టు చేతనే చెప్పిస్తున్నాడట. లుక్స్ లో వేరియేషన్ చూపించాడు కాబట్టి.. వాయిస్ లో వేరియేషన్ కోసం ఇలాంటి ప్రయత్నం చేశాడనమాట.
ఇప్పటికే కార్తి, విశాల్ వంటి హీరోలు తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు విక్రమ్ కూడా ఒక పాత్రకు పూర్తి నిడివిలో చెప్పేసి ఆ గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడనమాట. అది సంగతి.