Begin typing your search above and press return to search.
విక్రమ్ మేకప్ కోసం అన్ని గంటలా?
By: Tupaki Desk | 7 Jan 2023 6:40 AM GMTవిభిన్నమైన పాత్రలతో, సరికొత్త మేకోవర్ లతో కమల్ హాసన్ అబ్బుర పరుస్తుంటారు. ఆయన తరువాత అదే తరహాలో పాత్ర కోసం ఎలాంటి రిస్క్, ప్రయోగం చేయడానికైనా ముందు వరుసలో నిలిచే వ్యక్తి చియాన్ విక్రమ్. కెరీర్ ప్రారంభం నుంచి కమల్ తరహాలో పాత్రల పరంగా, మేకోవర్ పరంగా ప్రయోగాలు చేస్తూ తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న విక్రమ్ ప్రస్తుతం పా. రంజిత్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ మూవీ `తంగాలన్`లో నటిస్తున్న విషయం తెలిసిందే.
వెర్సటైల్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న విక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీలోనూ విక్రమ్ విభిన్నమైన వేషధారణలో బారు గడ్డం, గోచీ లాంటి వస్త్రధారణతో కనిపించబోతున్నాడు.
స్వతంత్రానికి పూర్వం కేజీఎఫ్ లోని నరాచీలో సాగే కథగా ఈ మూవీని దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేళ్ రాజా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
1800 సంవత్సరంలో నరాచీ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణ కాండ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. విచిత్ర వేషధారణలో చియాన్ విక్రమ్ బారు గడ్డం.. చేతిలో కత్తి.. ముక్కు, చెవికి పోగులతో కనిపించిన మేకోవర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్ కనిపిస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
అయితే ఈ క్యారెక్టర్ మేకోవర్ కు సంబంధించిన మేకప్ కోసం విక్రమ్ కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి వస్తోందని తెలిసింది. ఈ క్యారెక్టర్ మేకప్ కోసం విక్రమ్ కు దాదాపు 4 గంటలు పడుతోందట. క్యారెక్టర్, స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో ఇన్ని గంటల పాటు మేకప్ కోసం ఎదురు చూడక తప్పడం లేదని చెబుతున్నారు.
ఇక ఈ మూవీలో పార్వతీ మీనన్, మాళవికా మోహనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పశుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ వరల్డ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.