Begin typing your search above and press return to search.
హమ్మయ్యా.. అతను లేడీని అందుకున్నాడు
By: Tupaki Desk | 19 Jun 2016 3:59 AM GMTమొన్న మన భారతీయ ప్రభుత్వం ''నేషనల్ ఫిలిం అవార్డులు'' ప్రకటించినప్పుడు.. అలాగే వాటిని అందజేసినప్పుడు.. చాలామంది సౌత్ ఇండియన్ల నాడి మాత్రం చాలా వేగంగా కొట్టుకుంది. తమ టాలెంటును ఆ లెవెల్లో తొక్కేశారని.. కనీసం గౌరవ మర్యాద కూడా ఇవ్వలేదని దక్షిణాది సినిమా లవర్స్ వాపోయారు. ముఖ్యంగా తెలుగు అండ్ తమిళం ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు.
అవును.. పీకూ సినిమాలో అమితాబ్ బచ్చన్ కంటే.. 'ఐ' సినిమాలో విక్రమ్ చేసిన నటనే అమోఘం అని అందరి అభిప్రాయం. పైగా ఈ సినిమాకోసం మూడుసార్లు వెయిట్ పెరగడం తగ్గడం అనేవి చేస్తూ.. ఒక పాత్ర కోసం ఫిజికల్ గా అంత టార్చర్ అనుభవిస్తే.. మనోళ్ళు ఉత్తమ నటుడు అవార్డును అమితాబ్ కు అందించారు. ఒక జెన్యూన్ టాలెంట్ కు పురస్కారం దక్కలేదనేది నిజమే. అయితే ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డుల్లో మాత్రం అలా జరుగలేదు. అసలు నామినేషన్లలో ఉన్న తక్కిన వారి సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ.. ''బెస్ట్ యాక్టర్'' అవార్డు మాత్రం విక్రమ్ కే వచ్చింది. మనోడు తన నటనకు ప్రతీకగా బ్లాక్ లేడీని అందుకున్నాడు.
బహుశా ఈ అవార్డుతో అటు తమిళ్.. ఇటు తెలుగు.. ప్రేక్షకులు కూడా హ్యాపీగానే ఫీలైయుంటారు. కంగ్రాట్స్ విక్రమ్!!