Begin typing your search above and press return to search.
ఇంకొక్కడు ఏ జోనర్ మూవీ అంటే..
By: Tupaki Desk | 7 Sep 2016 4:41 AM GMTచియాన్ విక్రమ్ నటించిన ఇంకొక్కడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తమిళ్ లో ఇరు మగన్ టైటిల్ పై రూపొందిన మూవీని.. తెలుగులో ఇంకొక్కడు పేరుతో డబ్బింగ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకూ ఒక లెక్క.. అది వచ్చాక ఒక లెక్క అన్న రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు మారిపోయాయి. రెండు కేరక్టర్లతో విక్రమ్ మరోసారి ఎక్స్ ట్రీమ్ ఎక్స్ పెరిమెంట్ చేసేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా ఏ జోనర్ కి చెందినదనే డౌట్ చాలా మందికి ఉంది.
ఈ 8న రిలీజ్ అవుతున్న ఇంకొక్కడు ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విక్రమ్.. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు. 'ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ.. రొమాన్స్ ఉంటుంది.. కామెడీ ఉంటుంది.. సాంగ్స్ ఉంటాయ్.. థ్రిల్లర్ అనిపిస్తుంది.. ఛేజింగ్ సీన్స్ ఉంటాయ్.. ఫైట్స్ అదిరిపోతాయ్.. ఇక సెంటిమెంట్ విషయానికొస్తే.. ఫాదర్ మదర్ సెంటిమెంట్.. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్.. బ్రదర్ మదర్ సెంటిమెంట్ ఉంటాయి.. ఇన్ని ఉన్నా ఇది సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ. ఈ సినిమాకి హీరో స్టోరీనే' అంటున్నాడు చియాన్ విక్రమ్.
సినిమా చూసిన తర్వాత.. నయనతార- నిత్యా మీనన్ ల పాత్రలకు హీరోయిన్లను కరెక్ట్ గా సెలక్ట్ చేశారు అనిపిస్తుందని.. డైరెక్టర్ ఆనంద్ శంకర్ అంత విజన్ ఉంటుందని చెప్పాడు విక్రమ్. ఇక తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న కృష్ణారెడ్డి.. 'ఇరు మగన్ ట్రైలర్ చూశాక.. చేస్తే ఇలాటి సినిమాతోనే తెలుగు సినిమా నిర్మాణం స్టార్ చేయాలని అనిపించింది. చెన్నై వెళ్లి నిర్మాతలతో మాట్లాడితే ఒకే ఒక్క రోజు.. ఒక్క గంటలోనే సినిమా ఓకే చేశారు' చెప్పాడు కృష్ణారెడ్డి.
అన్నట్లు.. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఓసారి తిరుమల వెంకన్న దర్శనానికి వెళితే.. విక్రమ్ ఫ్యామిలీ కోసం కృష్ణారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడట. అంత అద్భుతంగా ఎప్పుడూ దర్శనం కాలేదని చెబుతున్నాడు విక్రమ్.