Begin typing your search above and press return to search.

విక్రమ్ పెళ్లికి ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   27 Aug 2016 9:30 AM GMT
విక్రమ్ పెళ్లికి ముహూర్తం ఖరారు
X
విక్రమ్ కూతురి పెళ్లి అనబోయి.. విక్రమ్ అనేశారేమో అనుకోకండి. ఇక్కడ మాట్లాడుతోంది విక్రమ్ పెళ్లి గురించే. ఐతే అది చియాన్ విక్రమ్ కాదు.. ‘మనం’ విక్రమ్. సినిమానే జీవితంగా మారిపోవడంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి చాలా ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయాడు విక్రమ్ కుమార్. ఈ మధ్యే ‘24’ సినిమా కోసం ఎ.ఆర్.రెహమాన్ దగ్గర మ్యూజిక్ చేయించుకునే క్రమంలో ఆయన దగ్గర సౌండ్ ఇంజినీర్‌ గా పని చేసే శ్రీనిధి అనే అమ్మాయితో అభిరుచులు కలిసి.. ఆమెతో ఏడడుగులు నడిచేయాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్. ఆర్నెల్ల కిందటే ఈ కమిట్ మెంట్‌ కు వచ్చిన విక్రమ్-శ్రీనిధి ‘24’ సినిమా విడుదలయ్యాక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఇప్పుడిక వీరి పెళ్లికి కూడా ముహూర్తం కుదిరింది. సెప్టెంబరు 4న.. అంటే వచ్చే ఆదివారం ఉదయం 6.30-7.30 మధ్య వీరి పెళ్లి జరగనుంది. చెన్నైలోని హిల్టన్ హోటల్లో పెళ్లి వేడుక నిర్వహిస్తారు. వెడ్డింగ్ కార్డ్స్ పంపకం కూడా అయిపోయింది. విక్రమ్ తల్లి విశాల విజయకుమార్ పేరు మీద కార్డ్స్ అందాయి. విక్రమ్ తండ్రి విజయ్ కుమార్ చనిపోయారు. శ్రీనిధి తల్లిదండ్రుల పేర్లు.. జయశ్రీ..వెంకటేష్. పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత తన తర్వాతి సినిమా పనిలో పడనున్నాడు విక్రమ్. అతడికి అల్లు అర్జున్.. మహేష్ బాబులతో కమిట్మెంట్లున్నాయి. ముందు బన్నీతో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఐతే ఏ విషయం కన్ఫమ్ కాలేదు.