Begin typing your search above and press return to search.
కాలంతో ఆడుకోవడం అతనికి ఇష్టమా?
By: Tupaki Desk | 30 Nov 2015 3:48 AM GMTమనం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విక్రమ్ కుమార్ కి ఆ సినిమాకి ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సంగతి కొందరికే తెలుసు. తన తొలి సినిమా ఇష్టం ఫ్లాప్ అవ్వడంతో దాదాపు కొన్నేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా విక్రమ్ అతి తక్కువ బడ్జెట్ తో మాధవన్ తో '13B' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఆ తరువాత మనం విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించడం ఇప్పుడు తమిళనాట సూర్య తో తన కలల ప్రాజెక్ట్ '24' తెరకెక్కిస్తుండడం చకచకా జరిగిపోతున్నాయి.
'24' సినిమా టైం మెషిన్ లతో ముడిపడి వున్న కధాంశమని ఇప్పటికే ప్రకటన జరిగింది. అయితే విక్రమ్ ట్రాక్ చూస్తుంటే అతనికి కాలంలో ఆడుకోవడం ఇష్టమని అర్ధమవుతుంది. 13B లో 30 సంవత్సరాల ముందు జరిగిన హత్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం సీరియల్ సాగుతుంటే, మనంలో పునర్జన్మల నేపధ్యంలో మూడు విభిన్న కాలాలలో సినిమా సాగుతుంది. ఇక ఈ 24 కూడా భూత, వర్తమానకాలాలకు ముడిపడి వుంటుందని సమాచారం. ఏదైనా విక్రమ్ డి డిఫరెంట్ జోనర్ కదండీ...