Begin typing your search above and press return to search.
స్పీడ్ పెంచనున్న విక్రమ్ కుమార్
By: Tupaki Desk | 26 Aug 2019 4:12 AM GMTటాలీవుడ్ లో ఒక్కో దర్శకుడికి ఒక్కో మేకింగ్ స్టైల్ ఉంటుంది. పూరి లాంటి యాభై - అరవై రోజుల్లో సినిమా తీస్తే రాజమౌళి లాంటి వాళ్ళు రెండేళ్లు - మూడేళ్లు తీసుకుంటారు. దర్శకుడు విక్రమ్ కూడా ఇంతే తన మేకింగ్ స్టైల్ తో షూటింగ్ డేస్ ఎక్కువ తీసుకుంటాడు. హెలో లాంటి సింపుల్ లవ్ స్టొరీ కి కూడా చాలా నెలల తీసుకున్నాడు. సినిమా సినిమాకు షూట్ డేస్ పెంచేస్తున్న విక్రమ్ ఇప్పుడు తన సినిమాలను స్పీడప్ చేసాడు. దానికి ఉదాహరణ గ్యాంగ్ లీడర్.
అయితే షూటింగ్ కి ఎక్కువ టైం తీసుకొని రిలీజ్ వరకూ చెక్కే దర్శకుడు విక్రమ్ ఈసారి స్పీడ్ పెంచడానికి రీజన్ హీరో నాని అట. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాడు. నా వల్లే షూటింగ్ స్పీడ్ అయిందని విక్రమ్ ని పరిగెత్తించాను అని చెప్పాడు. అంటే కాదు ఇకపై ఇదే స్పీడ్ తో సినిమాలు చేస్తానని నానికి మాటిచ్చాడట విక్రమ్. ఇదే మాట మీద ఉంటే విక్రమ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
కామెడీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాను 87 రోజుల్లో తీశారని సమాచారం. సెప్టెంబర్ 13న థియేటర్స్ లోకి రానుంది. నాని పెన్సిల్ అనే రైటర్ గా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. మరి ఈసారి తక్కువ రోజుల్లో విక్రమ్ తీసిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తుందో.