Begin typing your search above and press return to search.

ప్చ్‌.. ఈ టైమ్‌ ట్రావెల్‌ మహేష్‌ దా??

By:  Tupaki Desk   |   25 Nov 2015 11:27 AM GMT
ప్చ్‌.. ఈ టైమ్‌ ట్రావెల్‌ మహేష్‌ దా??
X
అంతే మరి. తొలిప్రేమ స్క్రిప్టును సుమంత్ కు చెబితే రిజెక్టు చేశాడు. కట్‌ చేస్తే పవన్‌ కళ్యాణ్‌ కెరియర్‌ ను మార్చేసిన సినిమా అది. ఇడియట్‌ సినిమాను పవన్‌ వద్దన్నాడు. ఆ దెబ్బకి రవితేజ సూపర్‌ స్టార్ అయ్యాడు. అవన్నీ పక్కనెట్టేస్తే.. ఒక హీరో వద్దంటే ఇంకో హీరో కూడా వద్దంటాడని అనుకోవక్కర్లేదు. సరిగ్గా మహేష్‌ బాబుకు చెప్పిన స్క్రిప్టు విషయంలో అదే జరిగింది.

తమిళ హీరో సూర్య ప్రస్తుతం మనం డైరక్టర్ విక్రమ్‌ కె కుమార్‌ తో కలసి 24 అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కథను ముందుగా విక్రమ్‌ మన మహేష్‌ కు వినిపించాడట. స్టోరీ మొత్తం విని.. ఈ సినిమాలోని టైమ్ ట్రావెల్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిసోడ్‌ ను ఎంతగానో లవ్‌ చేశాడట. కాకపోతే ఫస్టాఫ్‌ నచ్చింది కాని.. సెకండాఫ్‌ మాత్రం మహేష్‌ కు నచ్చలేదు. కాని సెకండాఫ్‌ లో మార్పులు చేయడం ఇష్టంలేని విక్రమ్‌ వెంటనే ఈ కథను సూర్యకు చెప్పగా.. మనోడు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. సో.. ఆ విధంగా ఈ టైమ్‌ ట్రావెల్‌ సినిమా మహేష్‌ చేతిలో నుండి సూర్య చేతిలో పడింది.

సూర్య సరసన సమంత హీరోయిన్‌ గా నటిస్తున్న 24 సినిమా ఫస్ట్‌ లుక్‌ మొన్ననే విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే.