Begin typing your search above and press return to search.
ప్లాప్ అయినా సంతృప్తిని ఇచ్చిన సినిమా
By: Tupaki Desk | 11 Jun 2021 11:30 AM GMTకొన్ని సినిమాలను మేకర్స్ ఎంతో ఇష్టపడి.. నమ్మకంతో చేస్తారు. హీరోలు కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో నటిస్తారు. కాని అలాంటి సినిమాలు ప్లాప్ అయినప్పుడు వారికి చాలా నిరుత్సాహం కలుగుతుంది. మంచి సబ్జెక్ట్ అని తీస్తే ప్రేక్షకులు ఇలా చేశారంటూ కొన్ని సార్లు ప్రేక్షకుల తీరుపై మేకర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా ఏదో ఒక రకంగా సంతృప్తిని మాత్రం కలిగిస్తుంది. ఆ సంతృప్తి గ్యాంగ్ లీడర్ విషయంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ కు దక్కిందట.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ.. చాలా నమ్మకంతో గ్యాంగ్ లీడర్ సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. కాని ఆ సినిమా నిరాశ పర్చడం ను తాను ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నాను. నా భార్య శ్రీనిధి నా ప్రతి సినిమాకు కూడా విమర్శకురాలిగా ఉంటుంది. తనకు గ్యాంగ్ లీడర్ సినిమా కథ చెప్పిన సమయంలో మంచి కథ అంటూ అభినందించింది. తను నా కథకు ఇచ్చిన కాంప్లిమెంట్ తో సినిమాపై మరింత నమ్మకం కలిగింది. నాని కూడా కథను బాగా మెచ్చి చేశాడు.
గ్యాంగ్ లీడర్ కథ పై అందరం కూడా చాలా నమ్మకంతో ఉన్న సమయంలో సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చింది. హీరో పాత్ర చాలా యూనిక్ గా ఉందని.. వేరే వాళ్ల రివేంజ్ ను తను తీర్చుకోవడం అనేది కొత్తగా ఉందంటూ అంతా కూడా ప్రశంసించారు. ఇక గ్యాంగ్ లీడర్ తెలుగు లో కమర్షియల్ గా సక్సెస్ దక్కించుకోలేక పోయినా కూడా హిందీ.. తమిళం మరియు మలయాళంలో కూడా రీమేక్ చేయబోతున్నారు. తమ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం చాలా గౌరవం. ఆ విషయంలో తనకు గ్యాంగ్ లీడర్ చాలా సంతృప్తిని ఇచ్చిందని విక్రమ్ కుమార్ అన్నాడు.