Begin typing your search above and press return to search.
'విక్రమ్'లోని ఈ క్యారెక్టర్ వెనక కొత్త కథ వుందా?
By: Tupaki Desk | 21 Jun 2022 2:30 AM GMTహాలీవుడ్ కు చెందిన మార్వెల్ సిరీస్ చిత్రాల్లో ఒకదానికి ఒకటి లింకై వుంటాయి. ఒక సినిమాలోని హీరో మరో సినిమాలోని పాత్రకు సంబంధంతో రన్నవుతూ వుంటుంది. ఇదే ఫార్ములాని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాలకు అప్లై చేస్తూ మల్టీవర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన చిత్రం `విక్రమ్`. ఇటీవల వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ఈ మూవీ వసూళ్ల పరంగా రికార్డుల్ని తిరగరాస్తూ కమల్ కెరీర్ లోనే అత్యథిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేన్ నటించారు. క్లైమాక్స్ లో వచ్చే కీలక అతిథి పాత్రలో హీరో సూర్య రోలెక్స్ గా కనిపించి అదరగొట్టేశారు. నాలుగేళ్ల విరామం తరువాత కమల్ నుంచి వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీలోని ఓ సీన్ లో కార్తి నటించిన `ఖైదీ` మూవీలోని ఓ సీన్ ని చూపించి ఈ మూవీకి `ఖైదీ`కి వున్న లింక్ ని చూపించారు. ఇక ఇదే సినిమాకు సీక్వెల్ గా `ఖైదీ 2`ని చేయబోతున్నామని దర్శకుడు లోకేష్ కనగరాజ్ `ఖైదీ`లో చూపించని బ్యాకెండ్ స్టోరీని చెప్పబోతున్నాట. ఇదే తరహాలో `విక్రమ్` మూవీలోని ఓ కీలక క్యారెక్టర్ కు సంబంధించిన కథని కూడా `విక్రమ్` సీక్వెల్ లో తెరపైకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
`విక్రమ్`లో విజయ్ సేతుపతి, నరేన్ లతో పాటు ఏజెంట్ అమర్ క్యారెక్టర్ లో బ్లాక్ ఓప్స్ స్క్వాడ్ కమాండర్ గా ఫహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ ఏజెంట్ అమర్ ఎవరు? ఏంటీ? ఇతని కథ అన్నది మాత్రం రివీల్ చేయలేదు. కానీ `విక్రమ్` సీక్వెల్ లో మాత్రం అమర్ వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీని చూపించబోతున్నారట.
ఇదిలా వుంటే `ఖైదీ`కి సీక్వెల్ గా చేయనున్న `ఖైదీ 2`లో ఢిల్లీ కి అడై కాలమ్ కున్న సంబంధం ఏంటీ? .. ఢిల్లీ వైఫ్ ఎలా చనిపోయింది? .. ఢిల్లీ ఎందుకు జైలు శిక్ష అనుభవించాడు? .. అంతకు ముందు అతని కథేంటీ? అన్నది ఆసక్తిని రేకెత్తించనుందని, ఒక విధంగా చెప్పాలంటే `ఖైదీ 2` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.