Begin typing your search above and press return to search.

అక్కడ 'విక్రమ్‌' స్ట్రీమింగ్‌ అవ్వక పోవడంకు కారణం ఏంటో..!

By:  Tupaki Desk   |   10 July 2022 8:59 AM GMT
అక్కడ విక్రమ్‌ స్ట్రీమింగ్‌ అవ్వక పోవడంకు కారణం ఏంటో..!
X
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ దాదాపుగా దశాబ్ద కాలంగా కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరుకున్న బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. విక్రమ్‌ సినిమా తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారీ కమర్షియల్‌ విజయాన్ని కమల్‌ కు అందించాడు. తమిళనాట ఏకంగా ఇండస్ట్రీ హిట్ నమోదు అవ్వగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 400 కోట్లకు పైగానే రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా మొదలు అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఇండియా వ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది. విక్రమ్‌ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వివిధ భాషల్లో ట్రెండ్‌ అవుతుంది. విక్రమ్‌ సినిమా ను థియేటర్ ల్లో ఏ స్థాయిలో చూశారో.. ఇప్పుడు అదే స్థాయిలో ఓటీటీ లో కూడా చూస్తున్నారు.

అమెరికాలో ఉన్న ఇండియన్ సినీ అభిమానులు విక్రమ్‌ ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే సాధ్యం అవ్వడం లేదు. వారికి డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో విక్రమ్‌ సినిమా అందుబాటు లో లేదు. కారణం ఏంటీ అనే విషయం పై యూనిట్‌ సభ్యులు కాని.. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు కాని క్లారిటీ ఇవ్వడం లేదు.

కాని ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో కాకుండా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ద్వారా అమెరికన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు విక్రమ్ ను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అతి త్వరలోనే యూఎస్ సినీ ప్రేమికుల వద్దకు కూడా విక్రమ్‌ వెళ్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో రెండు మూడు ఓటీటీ లు ఒక్క సినిమాను స్ట్రీమింగ్‌ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఎక్కువ లాభం దక్కుతుందట.. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా వెసులుబాటు ఓటీటీలకు ఉంటుందని అంటున్నారు. అందుకే విక్రమ్ ను ఆ దిశగా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

కమల్‌ హాసన్ తో పాటు ఈ సినిమా లో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో సూర్య కూడా కనిపించాడు. మొత్తానికి విక్రమ్‌ సినిమా ఫుల్ ప్యాక్ మల్టీస్టారర్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించి సూపర్ హిట్‌ ను దక్కించుకున్నాడు.