Begin typing your search above and press return to search.
బుసాన్ పెస్టివల్స్ లో విక్రమ్ తుటాలు!
By: Tupaki Desk | 4 Oct 2022 7:30 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ ఖ్యాతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత వేదికలపై కమల్ సినిమాలు ప్రత్యేకంగా మెరుస్తుంటాయి. అవార్డు వేడుకల్లో..అంతర్జాతీయ ఫిల్మ్ పెస్టివల్స్ లో విశ్వనటుడి సినిమాలు ప్రదర్శితం అవుతుంటాయి. ఆ రకంగా అవార్డులు..రివార్డులు కమల్ ఇంట ఎన్నో వెలిసాయి. కమల్ కి విశ్వ వ్యాప్త కీర్తిని తీసుకొచ్చింది ఆయా వేదికలే.
ఇన్నో వేటివ్ చిత్రాలు.. వైవిథ్యమైన కంటెంట్ తోనే కమల్ ఆ స్థాయికి చేరుకున్నారు. కమర్శియల్ సినిమాల కన్నా? తన ద్వారా ఓ సందేహాన్ని పాస్ చేయడమే గొప్ప విషయంగా భావిస్తారు. అంతటి గొప్ప నటుడు కాబట్టే దశావతారం..విశ్వరూపం లాంటి యూనిక్ సినిమాలు రాగలిగాయి. ఇలాంటి సినిమాలు చేయడం కేవలం ఇండియాలో కమల్ కి మాత్రమే సాధ్యం.
ఆ రెండు సినిమాలు పలు ఫిలిం పెస్టివల్స్ లో సైతం ప్రదర్శింపబడ్డాయి. తాజాగా ఇటీవల విడుదలైన 'విక్రమ్' ప్రతిష్టాత్మక బుసాన్ అంతర్జాతీయ ఫిలిం సెట్టివల్స్ కి ఎంపికైంది.
ఈ ఉత్సవాలు ఈనెల 5 నుంచి 14 వరకూ జరుగుతాయి. ఓపెన్ సినిమా కేటగిరి విభాగంలో విక్రమ్ ప్రదర్శితం కానుంది. ఆ రకంగా విక్రమ్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది.
ఇక ఈ సినిమా ఇండియాని ఏ రేంజ్లో షేక్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. సౌత్ తో పాటు హిందీ బెల్ట్ లోనూ భారీ వసూళ్లు సాధించిన చిత్రమిది. కమర్శియల్ గా కమల్ కి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన సక్సెస్ ఇది. కొంత కాలంగా కమల్ చేస్తోన్న సినిమాలు భారీ నష్టాలు తప్ప రికవరీ కూడా లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో యంగ్ మేకర్ లోకేష్ కనగరాజ్ తో టై అప్ అయి విక్రమ్ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇందులో కమల్ నటిస్తూ సొంత బ్యానర్ పై నిర్మించారు. పాన్ ఇండియాలో విడుదలైన సినిమా భారీ వసూళ్లని సాధించింది. దీంతో కమల్ అన్ని భాషల ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆయా భాషల్లో కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. విక్రమ్ కి కొనసాగింపు విక్రమ్-2 కూడా రాబోతుంది. దీనికి మూలం ఖైదీ. ఆ సినిమాని బేస్ చేసుకునే విక్రమ్ ని తెరకెక్కించారు. ఈప్రాంచైజీ నుంచి మరిన్ని చిత్రాలు రానున్నాయి. వాటిలో వివిధ భాషల హీరోలు నటించే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.