Begin typing your search above and press return to search.

క‌మల్ హాసన్ 'విక్రమ్' రైట్స్ యూత్ స్టార్ కి

By:  Tupaki Desk   |   20 May 2022 4:32 AM GMT
క‌మల్ హాసన్ విక్రమ్ రైట్స్ యూత్ స్టార్ కి
X
విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ తాను ఎంచుకున్న ప్ర‌యోగాల బాట‌ను విడ‌వ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత ఆయ‌న తిరిగి వ‌స్తున్నారు. క‌మ‌ల్ న‌టించిన భారీ యాక్షన్ థ్రిల్ల‌ర్ కం ఎంటర్ టైనర్ విక్రమ్ జూన్ 3న ఘ‌నంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి- ఫహద్ ఫాజిల్ ఇత‌ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి క‌మ‌ల్ అభిమాని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.

తాజాగా విక్రమ్ చిత్రంలో హీరో సూర్య అతిథి పాత్రలో నటిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీని తెలుగులో ఎవ‌రు రిలీజ్ చేస్తున్నారు? అన్న‌దానికి ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాచారం లేదు.

తాజా స‌మాచారం మేర‌కు..టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ `విక్రమ్` తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా థియేటర్లలో విడుదల కానుంద‌ని స‌మాచారం.

నితిన్ స్వ‌యంగా పూనుకుని విక్ర‌మ్ కి ప్ర‌మోష‌న్ చేయ‌నున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ తమిళ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. త్వ‌ర‌లోనే తెలుగు ట్రైల‌ర్ కూడా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

మరోవైపు శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఓవైపు విక్ర‌మ్ మూవీకి మ‌రోవైపు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రానికి నితిన్ ప్ర‌చారం ప‌రంగా త‌న‌ షెడ్యూల్స్ కేటాయించాల్సి ఉంటుంది.