Begin typing your search above and press return to search.

కొడుకు వద్దంటే నాన్నే చేసేవాడట

By:  Tupaki Desk   |   22 Jan 2018 7:37 AM GMT
కొడుకు వద్దంటే నాన్నే చేసేవాడట
X
ఇతర బాషల్లో అర్జున్ రెడ్డి రీమేక్ అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ హక్కుల కోసం జరిగిన పోటీ చిన్నదేమీ కాదు. హిందీలో అర్జున్ కపూర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలోనే ఇది రీమేక్ కానుండగా తమిళ్ లో విక్రం అబ్బాయి ధృవ్ డెబ్యు మూవీగా బాలా దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నాడు విక్రం. వారసుడిని మరో మూడేళ్ళు ఆగాక పరిచయం చేద్దామనుకున్నానని, కాని ఈ లోపు ఈ సబ్జెక్ట్ తో నిర్మాతలు కలవడం అందులోనూ బాలా సర్ దర్శకత్వం అనగానే ఇది వదులుకోవడం తప్పే అవుతుందని గుర్తించి వెంటనే ఓకే చెప్పేసాడట విక్రం. ప్రస్తుతం మెథడ్ యాక్టింగ్ మీద శిక్షణ కోసం విదేశాల్లో ఉన్న అది పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకే ఇది స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.

అర్జున్ రెడ్డి తమిళ్ మూవీకి వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఒకవేళ తన కొడుకు దీనికి సిద్ధంగా లేకపోయి ఉంటె తను చేయడానికి అయినా వెనుకాడేవాడిని కానని విక్రం చెప్పడం ఆశ్చర్యపరిచింది.అంతగా అర్జున్ రెడ్డి కథను సినిమాను ఇష్టపడ్డానని - వయసుకు తగ్గట్టు తన శరీరాన్ని మలుచుకోవడం తనకేమి కొత్త కాదన్న విక్రం నిజంగా అలా నటించాల్సి వస్తే విజయ్ దేవరకొండకు ధీటుగా తనను తాను మార్చుకునే టాలెంట్ ఉన్న వాడే. అపరిచితుడు, నాన్న, ఐ లాంటి సినిమాలు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.

విక్రం లేటెస్ట్ మూవీ స్కెచ్ తమిళ్ లో పొంగల్ కు విడుదలై ఓ మాదిరిగా పర్వాలేదు అనే దిశగా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఎటువంటి ప్రయోగాలు చేయకుండా రెగ్యులర్ మాస్ కమర్షియల్ మూవీగా చేసిన స్కెచ్ లో తమన్నా హీరొయిన్. తెలుగు వెర్షన్ డబ్ చేసి సిద్ధంగా ఉంచారు కాని విడుదల తేదికి సరైన స్లాట్ దొరక్క వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం విక్రం దర్శకుడు గౌతం మీనన్ రెండు భాగాల సినిమా 'అగ్ని నచ్చత్రం', హరి డైరెక్షన్ లో 'సామీ 2'లో నటిస్తున్నాడు.