Begin typing your search above and press return to search.

నెరిసిన జుట్టు.. ఇప్పుడు న్యూ ట్రెండ్

By:  Tupaki Desk   |   5 Feb 2018 4:53 PM GMT
నెరిసిన జుట్టు.. ఇప్పుడు న్యూ ట్రెండ్
X
ట్రెండ్ సెట్ చేయాల‌న్నా... క్రియేట్ చేయాల‌న్నా... హీరోల వ‌ల్లే అవుతుంది. గ‌తేడాది అజిత్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు... ఆ ట్రెండ్ ఇప్పుడు మిగ‌తా హీరోలు ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. విక్ర‌మ్ న్యూలుక్ మీద ఓ లుక్కేస్తే మీకే ఆ విష‌యం అర్థ‌మైపోతుంది.

త‌మిళంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లిన అజిత్‌... గ‌తేడాది వివేగం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమా హిట్టు - ఫ్లాపుల సంగ‌తి ప‌క్క‌న పెడితే... అందులో అత‌ని లుక్కు మాత్రం అమ్మాయిల‌కు తెగ న‌చ్చేసింది. జుట్టుకు రంగేయ‌కుండా... స‌హ‌జంగా నెరిసిన జుట్టుతో అందులో క‌నిపించాడు అజిత్‌. గ‌డ్డం - మీసం - జుట్టు అంతా ఇలా నెరిసే ఉంది. ఆ లుక్కు మంచి రెస్పాన్సే రావ‌డంతో... ఇప్పుడు మ‌రో పెద్ద హీరో విక్ర‌మ్ ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తున్నాడు. విక్ర‌మ్ కూడా నెరిసిన జుట్టుతో సాల్డ్ అండ్ పెప్ప‌ర్ లుక్‌ లో క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.

ఇప్ప‌టికే విక్ర‌మ్ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గ్రే హెయిర్ లుక్‌ లోనూ హీరోగానే అభిమానుల గుండెలు దోచేస్తున్నారు. ప్ర‌స్తుతం ధ్రువ న‌క్ష‌త్రం - సామి2ల‌లో న‌టిస్తున్నాడు. మ‌రి ఈ రెండు సినిమాల‌లో ఏ సినిమాలో ఈ నెరిసిన జుట్టుతో మెరుస్తాడో విక్ర‌మ్‌. లేక ఈ రెండు సినిమాల త‌రువాత కొత్త సినిమాలో గ్రే హెయిర్ ట్రెండ్ మొద‌లుపెడ‌తాడో చూడాలి.