Begin typing your search above and press return to search.
విక్రమ్ కోసమైతే చూడొచ్చు బాస్
By: Tupaki Desk | 8 Sep 2016 5:30 PM GMTనిజమే.. ‘ఇంకొక్కడు’ అంచనాలు అందుకోలేకపోయింది. ఓ దశలో సినిమా బోర్ కొట్టించింది. రొటీన్ గా సాగిపోయింది. మరోసారి విక్రమ్ కు.. అతడి అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఐతే ఈ సినిమాను పూర్తిగా తీసిపారేయడానికి మాత్రం లేదు. ముఖ్యంగా విక్రమ్ నటన కోసమైనా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత అరుదైన నటుల్లో విక్రమ్ ఒకడని మరోసారి రుజువైంది. గతంలో ఎన్నో సినిమాలు విక్రమ్ నట ప్రతిభకు తార్కాణాలుగా నిలవగా.. ‘ఇంకొక్కడు’ కూడా వాటి సరసన చేర్చదగ్గ సినిమానే. ఇండియాలో కమల్ హాసన్ మినహాయిస్తే ఇంకో నటుడి నుంచి ఇలాంటి నటనను చూడలేం.
సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘లవ్’ పాత్రలో విక్రమ్ అభినయం గురించే. హిజ్రాల బాడీ లాంగ్వేజ్.. వారి హావభావాలు ఎలా ఉంటాయో ఎంతో స్టడీ చేస్తే తప్ప అలా నటించడం కష్టం. చూడ్డానికి సింపుల్ గానే అనిపించొచ్చు కానీ.. ఒకవైపు సినిమాలో లీడ్ రోల్ చేస్తూ.. ఆ మూడ్లో ఉంటూ.. మరోవైపు ఈ పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. ‘లవ్’ పాత్రలో అంత ప్రత్యేకతను చూపించిన విక్రమ్.. మరోవైపు లీడ్ రోల్ లోనూ అంతే గొప్పగా నటించాడు. లవ్ పాత్ర స్పెషల్ కాబట్టి అందులో విక్రమ్ నట ప్రతిభ ఈజీగా తెలిసిపోతుంది. కానీ అఖిల్ పాత్రలో అతను చూపించిన ఇంటెన్సిటీ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇంటర్వెల్ ముందు సన్నివేశాల్లో ఆ పాత్రలో రౌద్రం చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. విక్రమ్ నటన కోసం వెళ్లినవారిని మాత్రం ‘ఇంకొక్కడు’ నిరాశ పరచదు. అతడి ప్రతిభను దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నందుకే విచారించాలి. స్వయంగా శంకరే ఈ విషయంలో తప్పటడుగు వేసినపుడు.. ఆనంద్ శంకర్ లాంటి యువ దర్శకుడిని మాత్రం ఏమంటాం?