Begin typing your search above and press return to search.

లక్ష్మీ నరసింహా సీక్వెల్.. టైటిల్ అదే

By:  Tupaki Desk   |   4 Oct 2017 12:05 PM IST
లక్ష్మీ నరసింహా సీక్వెల్.. టైటిల్ అదే
X
కోలీవుడ్ చియన్ విక్రమ్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను తీసి తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. నటన కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయని విక్రమ్ అంటే ఎవ్వరికైనా ఇష్టమే. ఇక ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు ఉంటే చాలా మంది దర్శకులు విక్రమ్ ను మొదటి ఆప్షన్ గా తీసుకుంటారు. అయితే గత కొంత కాలంగా విక్రమ్ ఎన్ని ప్రయోగాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావాన్ని చూపడం లేదు.

అయితే త్వరలోనే ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని కొత్త తరహా కథతో రాబోతున్నాడు. పోలీస్ సస్పెన్స్ డ్రామాలో ప్రముఖ తమిళ దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గత కొంత కాలంగా ఈ సినిమా టైటిల్స్ పై అనేక రూమర్లు వస్తున్నాయు. అసలైతే ఈ సినిమా 2003 లో వచ్చిన సామి కి సీక్వెల్ గా రాబోతోంది. అదే మన తెలుగులో వచ్చిన లక్ష్మీ నరసింహా ఉంది చూశారూ.. దాని మాతృకే ఈ సామి సినిమా. అప్పట్లో ఆ సినిమా విక్రమ్ కి మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడే అదే తరహాలో హిట్ కొట్టాలని విక్రమ్ అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి మొదట టైటిల్ ను సామి -2 అని అందరరు అనుకున్నారు. మీడియాల్లో కూడా అదే వార్త వచ్చింది.

కానీ చిత్ర యూనిట్ రీసెంట్ గా సడన్ ట్విస్ట్ ఇచ్చింది. విక్రమ్ సినిమాకు ''సామి స్క్వేర్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపింది. ఈ టైటిల్ పెట్టడానికి అసలు కారణం సినిమాలోనే ఉందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా త్రిష - కీర్తి సురేష్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి విక్రమ్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.