Begin typing your search above and press return to search.
ఏంటి సామీ ఆ వీరంగం?
By: Tupaki Desk | 9 Sep 2018 5:30 PM GMTచియాన్ విక్రమ్ నటించిన సామి దాదాపు 15 ఏళ్ల క్రితం రిలీజై తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విక్రమ్ ఈ సినిమాలో పక్కా మాస్ అవతార్ లో అదరగొట్టేశాడు. ఈసారి అప్ గ్రేడెడ్ కాప్ డ్రామాతో సామి సీక్వెల్ తెరకెక్కింది. ఈ సినిమా సాధ్యమైనంత తొందర్లోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నటి వరకూ సామి స్క్వేర్ అంటూ ప్రచారం సాగినా ఇప్పుడు మాత్రం సామి పేరుతోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. పుష్యమి ఫిలిం మేకర్స్ - ఎమ్.జి. ఔరా సినిమాస్ పతాకాలపై బెల్లం రామకృష్ణారెడ్డి - కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సామి - సింగం - సింగం 2 - సింగం 3 చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ని హైదరాబాద్ లో విడుదల చేశారు. తమిళ - తెలుగు భాషల్లో అతి త్వరలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
విక్రమ్ మాట్లాడుతూ-``తెలుగులో న్యూ ఎటెంప్ట్ ఇది. కమర్షియల్ ఎమోషనల్ సినిమాగా ఆకట్టుకుంటుంది. నాకు పెద్ద హిట్ ఇచ్చి నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టిన హరి మరోసారి తడాఖా చూపించారు. ఎప్పటి నుంచో సామి చిత్రానికి సీక్వెల్ చేయాలనుకున్నా 15 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే కనిపించేందుకు జాగ్రత్త పడ్డాం. కెమెరామెన్ బాగా కష్టపడాల్సి వచ్చింది`` అని తెలిపారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. అందరి కష్టపడి సినిమా చేశాం. తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా. తమిళంలో కూడా అతి త్వరలో విడుదల అవుతుంది అని తెలిపారు.
ఇకపోతే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర గురించి చెబుతూ తనో కామెడీ ట్రాక్ ని ప్లే చేసిందని తెలిపారు. అంటే కీర్తి పాత్ర మెరుపులా వచ్చి యాక్షన్ ఎంటర్ టైనర్ ని రక్తి కట్టిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలు ఎటెండయ్యారు. బాబి సింహా ఈ చిత్రంలో విలన్ గా నటించారు.