Begin typing your search above and press return to search.
సింగం సామీ అయ్యాడా!!!
By: Tupaki Desk | 20 Sep 2018 7:58 AM GMTరేపు బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మూడు సినిమాలు తలపడుతున్నాయి. అందులో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు యూత్ ని టార్గెట్ చేసుకున్న ప్రేమ కథలు కాగా మరొకటి తెలుగు డబ్బింగ్ వర్షన్ రూపంలో వస్తున్న సామీ స్క్వేర్. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రైలర్ అన్ని ఇందులో ఎంత మాస్ ఉందో ఇప్పటికే చూపించాయి. హద్దులు మీరిన హీరోయిజంని మాస్ కి కిక్కిచ్చేలా చూపడంలో నేర్పరి అయిన దర్శకుడు హరి సామీ స్క్వేర్ ని ఎలా తీర్చిదిద్ది ఉంటాడా అనే దాని మీద ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. సామీ మొదటి భాగం ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం వచ్చింది. అది తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహగా జయంత్ సి పరాంజీ రీమేక్ చేస్తే ఇక్కడా హిట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచితో పాటు మేకర్స్ దృక్పధంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ హరి మాత్రం పాతవాటికే కట్టుబడి అదే రొటీన్ మాస్ పోలీస్ ఫార్ములాలో వెళ్లినట్టు కనిపిస్తోంది.
ఇది చాలదు అన్నట్టు మొత్తం తమిళ నేటివిటీతో నింపడంతో సామీ ఎంతవరకు మనవాళ్లకు కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఇప్పటికీ సూర్యతో సింగం సిరీస్ పేరుతో మూడు సినిమాలు తీసిన హరి ఇకచాలు బాబోయ్ అనే దాకా వచ్చాడు. అయినా కూడా సామీ స్క్వేర్ మళ్ళి అదే రూట్ లో తీయడం అంటే సాహసమే. తెలుగు సంగతి పక్కన పెడితే తమిళ్ లో సైతం దీనికి భీభత్సమైన హైప్ ఏమి లేదు. కాకపోతే ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రాలేదు కాబట్టి జనం బాగానే చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా సింగం తరహాలోనే ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు. ఎంత మాస్ ని టార్గెట్ చేసినా ఎంతో కొంత కొత్తదనం ఉంటే తప్ప వాళ్ళూ ఒప్పుకోవడం లేదు. అలాంటిది ఇంత రొటీన్ గా అరుపులు కేకలతో పోలీస్ గూండా కాన్సెప్ట్ తో తీసిన సామీ స్క్వేర్ ఎంత వరకు మెప్పిస్తుందో రేపీ సమయానికి తేలిపోతుంది.