Begin typing your search above and press return to search.
ఈ వారసుడు టెస్ట్ పాసవుతాడా?
By: Tupaki Desk | 23 May 2019 4:51 AM GMTరేపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీతతో పాటు ఇంకొన్ని లైన్ లో ఉన్నాయి. అందులో ఎవడూ తక్కువ కాదు మీద మాస్ జనాల దృష్టి ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ ఫుల్ లెన్త్ హీరోగా దీంతో డెబ్యూ చేస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఏ మొహమూ పరిచయం లేని టీనేజర్స్ తో తమిళ్ లో నిర్మించిన గోళీసోడాకు ఇది రీమేక్. ఒక అమ్మాయి జీవితంతో ముడిపడిన నలుగురు బస్తీ కుర్రాళ్ళు స్థానిక రాజకీయ నాయకుడితో సై అంటే సై అంటూ సవాల్ కు దిగడం ఇందులో మెయిన్ పాయింట్.
దాన్ని అత్యంత సహజంగా దర్శకుడు తెరకెక్కించిన తీరుకు కమర్షియల్ గానూ గొప్ప ఫలితం దక్కింది. అందుకే ఎవడూ తక్కువ కాదు మీద ఇక్కడా అదే రిజల్ట్ ని నిర్మాతలు ఆశిస్తున్నారు. విక్రమ్ సహదేవ్ గతంలో నా పేరు సూర్యలో అన్వర్ గా చెప్పుకోదగ్గ పాత్రే చేశాడు. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో అతని గురించి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడీ ఎవడు తక్కువ కాదుతో డెబ్యూ తోనే సూపర్ హిట్ కొడతాడన్న నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది.
ప్రియాంకా జైన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. టాక్ పాజిటివ్ గా వస్తే నిలబడుతుంది. సీతతో పాటు లీసా అల్లాయుద్దీన్ పోటీలో ఉండటంతో ఎవడూ తక్కువ కాదు కాస్త గట్టిగానే ఫైట్ చేయాల్సి ఉంటుంది. మౌత్ టాక్ చాలా కీలకంగా మరీనా నేపధ్యంలో ఆ విషయంలో ఎవడు తక్కువ కాదు పాస్ అయితే బోణీ బాగుంటుంది. ఒకవేళ డెబ్యు కనక సక్సెస్ అయితే విక్రం తో వెంటవెంటనే సినిమాలు తీసేందుకు లగడపాటి శ్రీధర్ అప్పుడే రంగం సిద్ధం చేశారట