Begin typing your search above and press return to search.
ప్రముఖ హీరో కొడుకుపై 'యాక్సిడెంట్' కేసు!
By: Tupaki Desk | 12 Aug 2018 7:11 AM GMTప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ ఓ రోడ్ యాక్సిడెంట్ కు కారణమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో కారును అతివేగంతో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. వేగంగా వస్తోన్న ధ్రువ్ కారు....మూడు ఆటోలను ఢీకొట్టడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న గుంటలోకి దూసుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదంలో ఓ ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగిన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై నడిబొడ్డులో ఉన్న పోలీసు కమిషనర్ ఇంటివద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్నారు.
టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళ రీమేక్ `వర్మ`తో ధ్రువ్ తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు వెళుతుండగా....ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ధ్రువ్ కారు....రోడ్డు పక్కన ఆపి ఉన్న మూడు ఆటోలను ఢీకొట్టి కొంతమంది పాదచారులపైకి దూసుకెళ్లినట్లు తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కారు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రమాదం జరిగినపుడు ధ్రువ్ మద్యం సేవించి ఉన్నాడా....అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై విక్రమ్ - ధ్రువ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.