Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డిగా అపరిచితుడి కొడుకు
By: Tupaki Desk | 2 Oct 2017 4:14 AM GMTథియేటర్లలో కలెక్షన్లు - ఇండస్ట్రీలో విమర్శకుల నుంచి ప్రశంసలు ఒకే టైంలో కొల్లగొట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. ప్రజంట్ జనరేషన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చిపెట్టింది. సినిమాపై పెట్టుబడి పెట్టిన వారికి ఓ రకంగా కనకవర్షం కురిసిందని చెప్పాలి. న్యూ ఏజ్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమా రీమేక్ పై చాలామంది ఆసక్తిగా ఉన్నారు.
అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెంచుకున్న నటుడు విక్రమ్ తన కొడుకు ధృవ్ ను హీరోగా లాంచ్ చేసేందుకు చూస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అతడికి లాంచింగ్ కు సరైన సినిమా అవుతుందనే ఆలోచనలో విక్రమ్ ఉన్నాడనేది కోలీవుడ్ లేటెస్ట్ టాక్. ఈ సినిమా అయితే యాక్టింగ్ పరంగా పేరు తెచ్చుకోవడంతోపాటు యూత్ లోనూ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందనేది విక్రమ్ సన్నిహితులు చెబుతున్న మాట. తమిళ్ వెర్షన్ ను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో సూపర్ హిట్ కావడంతో రీమేక్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్లే వచ్చాయి. తమిళ రైట్స్ కు సంబంధించి లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ దక్కించుకుందని తెలుస్తోంది. విక్రమ్ వారి దగ్గర హక్కులు కొనుగోలు చేస్తాడో.. లేక హక్కులు దక్కించుకున్నవారే నేరుగా సినిమా తీస్తారా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.