Begin typing your search above and press return to search.

వర్మ సినిమాలో ఆయన జోక్యం ఎక్కువైందట!

By:  Tupaki Desk   |   7 May 2019 7:02 AM GMT
వర్మ సినిమాలో ఆయన జోక్యం ఎక్కువైందట!
X
స్టార్ కిడ్స్ డెబ్యూ ఫిలిం అంటే సాధారణ సినిమాల కంటే కాస్త ఎక్కువగానే కేర్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆ డెబ్యూ హీరోలకంటే తల్లిదండ్రులకు టెన్షన్ డబల్ ఉంటుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. విక్రమ్ తనయుడు ధృవ్ 'ఆదిత్య వర్మ' సినిమాతో హీరోగా తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి విక్రమ్ తెగ టెన్షన్ పడిపోతున్నాడట.

'అర్జున్ రెడ్డి' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట బాలా దర్శకత్వంలో 'వర్మ' పేరుతో తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతా చూసుకుంటే అవుట్ పుట్ నచ్చలేదు. దీంతో సినిమా మొత్తాన్ని స్క్రాప్ చేసి మరోసారి ఫ్రెష్ గా 'ఆదిత్య వర్మ' టైటిల్ తో షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన గిరీశయ్య దర్శకుడు. అయితే మొదటిసారి అవుట్ పుట్ తేడాగా రావడంతో ఈసారి విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక కంట కనిపెడుతున్నాడట. రీసెంట్ గా 'ఆదిత్య వర్మ' టీమ్ పోర్చుగల్ కు వెళ్ళిన సమయంలో విక్రమ్ కూడా వారితో పాటు వెళ్ళి షూటింగ్ ఎలా సాగుతుందో గమనించాడట. అంతే కాదు ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనుంది.. ఈ షెడ్యూల్ కూడా విక్రమ్ కనుసన్నలల్లోనే జరగనుందట.

కొడుకుపై ప్రేమతో ఇలా సినిమాలో మితిమీరి జోక్యం చేసుకోవడం ఫైనల్ గా మంచి చేస్తుందా లేదా చేటు చేస్తుందా అనేది ఈ సినిమా టీజర్ ట్రైలర్ లు రిలీజ్ అయితే కానీ తెలీదు. ఈసారి నెగెటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం అందరి వేళ్ళు విక్రమ్ వైపు చూపిస్తాయనడంలో సందేహం లేదు.