Begin typing your search above and press return to search.
ఈ స్టార్స్ విడుదలకు ముందే చేతులెత్తేశారా?
By: Tupaki Desk | 27 Sep 2022 5:24 AM GMTబాలీవుడ్ సినిమా గతంలో మాదిరిగా జోష్ లో లేదనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా తర్వాత అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. వచ్చిన సినిమాలు వచ్చినట్లుగా డిజాస్టర్స్ గా నిలుస్తున్న సమయంలో ఒకటి రెండు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటున్నాయి. బ్రహ్మాస్త్ర వంటి సినిమాలకు భారీ ప్రమోషన్ చేయడం ద్వారా కాస్త నిలిచి వసూళ్లు నమోదు చేశాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న పరిస్థితి నేపథ్యంలో భారీ ప్రమోషన్ చేస్తే కానీ మినిమం అయినా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ వారం రాబోతున్న విక్రమ్ వేదా సినిమా యూనిట్ సభ్యులు ప్రమోషన్ విషయంలో బద్దకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియా వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.
విక్రమ్ వేదా సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. ఈ మల్టీస్టారర్ సినిమాను విడుదలకు ముందే చేతులు ఎత్తేసినట్లుగా ఆ ఇద్దరు వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ వేదా సినిమాను ప్రమోట్ అగ్రసివ్ గా చేయడం లేదు అనేది వారి యొక్క విమర్శ.
బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో యాక్షన్ ఎంటర్ టైనర్స్... మాస్ సినిమాలను ఆధరిస్తున్నారు.
విక్రమ్ వేదా కూడా ఆ జోనర్ లోనే రూపొందింది. పైగా ఇప్పటికే విజయం సాధించిన తమిళ విక్రమ్ వేదాకి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. కనుక కాస్త ఎక్కువగా ప్రమోట్ చేస్తేనే జనాలు చూసే అవకాశాలు ఉంటాయి. కానీ సినిమా ఫలితం ముందే తెలిసిందో లేదంటే ప్రమోషన్ చేయకున్నా సినిమా చూస్తారనే ఓవర్ కాన్ఫిడెన్సో కానీ విక్రమ్ వేదా కి భారీ రేంజ్ లో ప్రమోషన్స్ జరగడం లేదు.
ఇప్పటికే రీమేక్ సినిమాలను హిందీ ప్రేక్షకులు తిరష్కరించిన దాఖలాలు ఉన్నాయి. కరోనా తర్వాత వచ్చిన రీమేక్ సినిమాలు దాదాపు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. ఈ సినిమాపై కూడా పెద్దగా నమ్మకం ఇప్పటి వరకు కలగలేదు. అయినా కూడా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు కొత్తదనం లేకుండా రొటీన్ ఫార్మట్ లో వెళ్తున్నారు. ఇలా అయితే సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.