Begin typing your search above and press return to search.
ఆ రెండు పరిశ్రమలు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రాలివే!
By: Tupaki Desk | 27 Sep 2022 2:30 AM GMTకొద్ది కాలంగా కోలీవుడ్.. బాలీవుడ్ బాక్సాఫీస్ సౌండింగ్ మిస్సైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన సినిమాలన్ని దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ఇటీవలే బ్రహ్మస్ర్త కాస్త బాలీవుడ్ కి ఊపిరి పోసింది. సినిమాకి నష్టాలొచ్చానా ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో ఊపిరి తీసుకున్నారు. ఇక కోలీవుడ్ లో ఆ మాత్రం `విక్రమ్ ` భారీ వసూళ్లు సాధించి ఇండస్ర్టీని ట్రాక్ లోకి తీసుకొచ్చింది.
ఏదైనా టాలీవుడ్ కంటే ఆ రెండు పరిశ్రమాలు బాగా వెనుకబడ్డాయి అన్నది వాస్తవం. ఇప్పుడా వెనుకబాటు తనాన్ని మార్చాల్సిన బాధ్యత కోలీవుడ్ లో పొన్నియన్ సెల్వన్ పైనా..బాలీవుడ్ లో విక్రమ్ వేదపైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 30న భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న `పొన్నియన్ సెల్వన్` మొదటి భాగంపై భారీ అంచనాలున్నాయి. చోళ సామ్రాజ్యం కథకి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు భారీ హైప్ ని తీసుకొచ్చాయి. బాహుబలి సినిమాతోనే పొన్నియన్ సెల్వన్ ని అప్పుడే పోల్చడం మొదలు పెట్టారు.
అయితే ఇలాంటి కథల్ని మణిసర్ ఎలా డీల్ చేసారు? అన్నదే సస్పెన్స్ . పీరియాడిక్ నేపథ్యమున్న సినిమాలు ఇప్పటివరకూ ఆయన డీల్ చేయలేదు. ప్రేమ కావ్యాలకే అంకితమైన ఆయన కలం ఇప్పుడు స్వరూపం మార్చుకుని పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టి రాసిన కథగా తెలుస్తోంది. కోలీవుడ్ చరిత్రలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా రిలీజ్ అవుతుంది.
కోలీవుడ్ బాక్సాఫీస్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్..సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `విక్రమ్ వేద` సెప్టెంబర్ 30 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నాయి. హృతిక్-సైఫ్ యాక్షన్ తో బాక్సాఫీస్ మోతెక్కిపోవడం ఖాయమంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
సౌండింగ్ లేక వెలవెల బోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ని విక్రమ్ వేద వసూళ్లతో మోత మ్రోగించేస్తుందని బాలీవుడ్ అంతా వెయిట్ చేస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా కేటగిరివి కాబట్టి థియేటర్ల వద్ద పోటీ ఉంటుంది. ముఖ్యంగా మణిరత్నం సినిమాలకు బాలీవుడ్ లో నూ మంచి క్రేజ్ ఉంది. పైగా చరిత్ర నేపథ్యం గల సినిమా కాబట్టి నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం విక్రమ్ వేదపై వసూళ్లపై కొంత వరకూ పడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.