Begin typing your search above and press return to search.
దిగజారిన బాలీవుడ్ ప్రతిష్ఠను కాపాడేది ఆ ఒక్కటే!?
By: Tupaki Desk | 24 Aug 2022 1:30 AM GMTబాలీవుడ్ లో వరుసగా భారీ చిత్రాలు విడుదలై డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సామ్రాట్- రక్షాబంధన్- లాల్ సింగ్ చడ్డా తీవ్రంగా నిరాశపరిచాయి. హిందీ హీరోలకు ఎంపికలు తెలియడం లేదంటూ తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. తెలుగు నుంచి అనువదించి రిలీజ్ చేసిన కార్తికేయ 2 లాంటి చిన్న సినిమా హిందీ బెల్ట్ లో విపరీతమైన క్రేజ్ తో ఆడుతుండడం సంచలనమైంది.
అందుకే ఇప్పుడు బాలీవుడ్ కి లైఫ్ సేవర్ ఒకటి కావాలి. సెప్టెంబర్ లో ప్రధానంగా బ్రహ్మాస్త్ర- విక్రమ్ వేద అనే రెండు భారీ సినిమాలు ఆధిపత్యం చెలాయించేందుకు వస్తున్నాయి. ఈ రెండిటిలో ఏది బాలీవుడ్ ని కాపాడుతుంది? అన్నది ఇప్పుడు డిబేట్ గా మారింది. బ్రహ్మాస్త్ర గురించి కొన్ని విషయాలు చాలా కాలం నుండి బయటికి వస్తున్నా కానీ.. `విక్రమ్ వేద` రేసులో వెనకబడి ఉంది. ఈ బృందం ఎటువంటి ప్రచార మెటీరియల్ ని ఇంతవరకూ రివీల్ చేయలేదు. విక్రమ్ వేద టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ను డిమాండ్ చేస్తూ అభిమానులు కొన్ని వారాల నుండి సోషల్ మీడియాలో పిచ్చిగా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ ఆగస్ట్ 24న విడుదల కానుంది.
ఇంతలోనే హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ చిత్రం పరిశ్రమకు లైఫ్ సేవర్ అవుతుందని హామీ ఇస్తుందా? అంటూ నెటిజనుల్లో డిబేట్ వేడెక్కిస్తోంది. విక్రమ్ వేద టీజర్ స్నీక్ పీక్ పై అప్పుడే గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేందుకు అవసరమైన అన్ని రకాల ఎలిమెంట్స్ ని కలిగి ఉందని ఈ టీజర్ స్నీక్ పీక్ స్పష్టం చేసిందని గుసగుస వినిపిస్తోంది.
ఒక నిమిషం 46 సెకన్ల నిడివి గల ప్రోమో ఈ చిత్రం థీమ్ ను రివీల్ చేస్తుంది. హృతిక్ రోషన్ -సైఫ్ అలీ ఖాన్ పాత్రల మధ్య ఘర్షణను క్లుప్తంగా చూపుతుంది. సైఫ్ నిస్సందేహంగా మరోసారి తనదైన ముద్ర వేస్తాడు. అతని స్లో-మోషన్ వాకింగ్ స్టైల్..హీరోయిక్ లుక్ దానికి తగ్గట్టుగా ఉన్నాయనేది గుసగుస. హృతిక్ రోషన్ విషయానికొస్తే .. అతడు టీజర్ ఆద్యంతం ఎలా డామినేట్ చేసాడనేది చూసి తీరాలి. అతని బాడీ లాంగ్వేజ్ .. లుక్ పనితీరు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. హృతిక్ ఇంతకు ముందు ప్రయత్నించిన వాటికి భిన్నంగా కనిపిస్తాడు. సన్ గ్లాసెస్ ధరించి అతని స్లో మోషన్ వాకింగ్ స్టైల్ కి థియేటర్లలో చప్పట్లు ఈలలు ఖాయమనేది టాక్.
ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ముద్ర వేస్తుంది. ఈ మూవీ క్లాస్ మాస్ ఆడియెన్ ను మెప్పిస్తుంది. దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి రీమేక్ వెర్షన్ ను ఒరిజినల్ కంటే గొప్పగా రూపొందించారు. హృతిక్ రోషన్ విలన్ స్టైల్ స్మైల్ షాట్ టీజర్ లో చాలా సార్లు చూపిస్తారు. కానీ దీనికి ఒక ఉద్దేశ్యం కూడా ఉంటుంది. మనం సినిమాను చూసిన తర్వాత ఇది ఎందుకు అనేది అర్ధమవుతుంది.
వరుస ఫ్లాపులతో బాలీవుడ్ బెంబేలెత్తుతున్న తరుణంలో విక్రమ్ వేద టీజర్ పరిశ్రమకు ఆశలు నింపుతుందని ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇది మాస్ - క్లాస్ లకు నచ్చే ఆదర్శవంతమైన చిత్రమవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ 30 న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రతిచోటా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. టీజర్ అంతగా ప్రభావం చూపుతుందని ట్రైలర్ తో పతాక స్థాయికి క్రేజు చేరుతుందని కూడా టాక్ స్ప్రెడ్ అవుతోంది.