Begin typing your search above and press return to search.
'విక్రమ్ - వేద' ట్రైలర్ టాక్: కట్టిపడేసే ఇంటెన్స్ డ్రామా!
By: Tupaki Desk | 8 Sep 2022 11:42 AM GMTమాధవన్, విజయ్ సేతుపతి కలిసి 2017లో తమిళంలో చేసిన నీయో నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ వేద'. సుష్కర్ - గాయత్రి అనే దర్శకద్వయం తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే మూవీని మళ్లీ ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటించారు. సుష్కర్ - గాయత్రి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. రాధికా అప్టే హీరోయిన్ గా నటించింది.
సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించిన ఈ మూవీకి విశాల్ - శేఖర్ సంగీతం అందించారు. మాధవన్ పాత్రలో సైఫ్, విజయ్ సేతుపతి పాత్రలో హృతిక్ రోషన్ నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అత్యంత భారీ స్థాయిలో రా..
ఇంటెన్స్ డ్రామాగా పవర్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ని రీజెంట్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. రగ్గ్డ్ క్యారెక్టర్ తో వేదగా నటించిన హృతిక్ రోషన్ లుక్, బాడీ లాంగ్వేజ్, తనపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.
గురువారం ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. అంతే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించడం విశేషం. 'ప్రతీ కథలో మంచీ చెడు వుంటాయి. కానీ ఇది ఇద్దరు చెడ్డవారి కథ' అంటూ ట్రైలర్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో మొదలైంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సైఫ్ అలీఖాన్ నటించిన ఈ మూవీలో ఎటాంటి రిగ్రెట్ లేని గ్యాంగ్ స్టర్ గా హృతిక్ రోషన్ కనిపించాడు. తమిళ మాతృకని మించి మరింత కొత్తగా రా ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.
సినిమాలో సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ నువ్వా నేనా అనే స్థాయిలో పోటీపడి నటించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి నటన కట్టిపడేసేలా వుంది. తమిళ మాతృకతో పోలిస్తే విజయ్ సేతుపతి చేసిన వేద పాత్రని హృతిక్ రోషన్ బాడీలాంగ్వేజ్ కోసం చాలా మార్చినట్టుగా కనిపిస్తోంది. సినిమాలోని యాక్షనప్ ఘట్టాలు, హృతిక్ కనిపించే సన్నివేశాలు, సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తున్నాయి.
భారీ మార్పులతో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన 'విక్రమ్ వేద' సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ ప్రేక్షకులు ఇలాంటి ఇంటెన్స్ డ్రామా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ని బట్టి ఈ మూవీతో సైఫ్, హృతిక్ రోషన్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.