Begin typing your search above and press return to search.
దిగ్గజాల మధ్య దోబూచులాడుతున్న కల్ట్ రీమేక్
By: Tupaki Desk | 9 Feb 2019 7:54 AM GMTరెండు రోజుల క్రితం అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ ఫస్ట్ కాపీ వచ్చాక స్క్రాప్ గా ప్రకటించి మొత్తం మళ్ళి రీ షూట్ చేయబోతున్నట్టు ప్రకటించి నిర్మాణ సంస్థ ఈ4 పెను సంచలనమే రేపింది. ఎవరో ముక్కు మొహం తెలియని కొత్త డైరెక్టర్ అయితే ఇదేం పెద్ద న్యూస్ కాదు కాని తనకు మాత్రమే సాధ్యమయ్యే ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్న బాలా లాంటి దర్శకుడి సినిమాను చెత్త బాగా రాలేదు అని పబ్లిక్ గా ప్రకటించడం మాత్రం ఖచ్చితంగా షాకే .
దీనికి బాలా నుంచి నేరుగా స్పందన రాలేదు. హీరో కం విక్రం వారసుడు ధృవ్ ని మాత్రమే ఉంచి మిగిలిన టీం అందరిని మార్చి మొత్తం రీ షూట్ చేయబోతున్నారు. అయితే చెన్నై అప్ డేట్ ప్రకారం ఇప్పుడీ కల్ట్ క్లాస్సిక్ రీమేక్ మరో దిగ్గజం గౌతం మీనన్ చేతికి వెళ్ళబోతోందట. ప్రస్తుతం గౌతం విక్రంతో ధ్రువ నచ్చతిరం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపు పూర్తి అయ్యే స్టేజి లో ఉంది. ఈ సందర్భంగానే వర్మ సినిమా గురించి విక్రం గౌతం ల మధ్య చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు.
తనకు సేతు-శివపుత్రుడు లాంటి సినిమాలతో లైఫ్ ఇచ్చిన బాలాకు ఇలా జరగడం పట్ల బాధ ఉన్నప్పటికీ వర్మను అలాగే రిలీజ్ చేస్తే తన కొడుకుతో పాటు ఆయనకీ అది మరకగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో కష్టమైనా విక్రం నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాడని చెబుతున్నారు. మరి బాలా తీయలేకపోయిన అర్జున్ రెడ్డి రీమేక్ ని గౌతం తీయగలడా అంటే అధిక శాతం ఔననే సమాధానమే వస్తుంది. బాలా హార్డ్ గా ఉండే సబ్జెక్ట్స్ బాగా డీల్ చేయగలరు కాని సున్నితమైన ప్రేమ కథలు తీయలేరు. అందుకే వర్మ తేడా కొట్టింది. గౌతం కేస్ దీనికి రివర్స్. మరి వర్మ మూవీని గౌతం ఒప్పుకుంటాడా లేదా అనేది మరి కొద్దిరోజుల్లో తేలిపోతుంది