Begin typing your search above and press return to search.
విక్రమ్ కేజీఎఫ్ లోకి ఎంటరయ్యేది అప్పుడే!
By: Tupaki Desk | 9 Sep 2022 3:30 PM GMTచియాన్ విక్రమ్ 20 విభిన్నమైన గెటప్ లలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'కోబ్రా'. ఆర్. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని విక్రమ్ ఫ్యాన్స్ భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తే వారి ఆశలని అడియాశలు చేసి డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో జరిగిన తప్పు తెసుకున్న దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ..హీరో విక్రమ్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం విశేషం.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత విక్రమ్ దర్శకుడు పా. రంజత్ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ 61వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్నఈ మూవీని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
చెన్నైలో జూలై 17న ఈ మూవీకి భారీ స్థాయిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపించారు. 'కోబ్రా' డిజాస్టర్ నేపథ్యంలో విక్రమ్, పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కినున్న పీరియాడిక్ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ తాజాగా బయటికి వచ్చింది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వీంగ్ లో జరుగుతోందట. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీకి 'కేజీఎఫ్' కు సంబంధం వుంటుందని తెలుస్తోంది. 1800 సంవల్సరంలో దళితులపై జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని పా. రంజిత్ తెరకెక్కించబోతున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు ఇటీవల వెల్లడించడంతో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది.
ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో సాగే ఈ మూవీ 'కేజీఎఫ్' లోని నరాచీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారట. 'కేజీఎఫ్' కథ కు ముందు కాలం నాటి కథతో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారన్నమాట.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కేజీఎఫ్ లో ఏం జరిగిందన్నది ప్రశాంత్ నీల్ రెండు భాగాల్లో చూపించాడు. కానీ పా. రంజిత్ మాత్రం స్వాతంత్య్రానికి పూర్వం అక్కడ ఏం జరిగిందన్నది చూపించబోతున్నారట. దీంతో విక్రమ్ , పా. రంజిత్ ల ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.