Begin typing your search above and press return to search.
కల్యాణ్ రామ్, దుల్కర్ లని తట్టుకోగలిగితే సూపర్ హిట్టే!
By: Tupaki Desk | 3 Aug 2022 8:31 AM GMTగతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెల టాలీవుడ్ కు ఓ నైట్ మేర్ గా మిగిలిపోయింది. కారణం ఈ నెలలో విడుదలైన ప్రతీ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లు నిలిచాయి. కంటెంట్ పరంగా ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని సంతృప్తి పరచలేకపోయింది. గోపీచంద్ నటించిన `పక్కా కమర్షియల్`తో జూలై నెల ఫ్లాపుల ప్రయాణం మొదలైంది.
ఈ నెల ఎండింగ్ వరకు విడుదలైన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూనే వచ్చింది. ఇక నెల ఎండింగ్ లో థియేటర్లలోకొచ్చిన మాస్ మహారాజా రవితేజ మూవీ `రామారావు ఆన్ డ్యూటీ` పై భారీ ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది. వరుస ఫ్లాపుల నుంచి రామారావు అయినా గట్టెక్కిస్తాడని అంతా ఆశగా ఎదురుచూశారు. అయితే అందరి ఆశల్ని వమ్ము చేస్తూ `రామారావు ఆన్ డ్యూటీ` తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదిలా వుంటే కన్నడ నుంచి అనువాదమైన `విక్రాంత్ రోణ` ఊహించని విధంగా టాక్ కు కలెక్షన్ లకు సంబంధం లేకుండా ఆశ్చర్య పరిచింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది.
రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ`కి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జూలై 28న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్నవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో వచ్చిన తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ లుగా నిలిస్తే `విక్రాంత్ రోణ` మాత్రం విజువల్స్ తో ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబుడుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్పైడర్, రాక్షసుడు చిత్రాల తరహాలో సైకో థ్రిల్లర్ కథ కావడం, దీనికి విజువల్స్ ని యాడ్ చేసి ఐ ఫీస్ట్ గా మలచడంతో ప్రేక్షకులు ఈ మూవీని అమితంగా ఇష్టపడుతున్నారట.
ముందు నుంచి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన ఈ మూవీకి సైకో థ్రిల్లర్ స్టోరీనే ప్రధానంగా ఎంచుకున్నా ఆడియన్స్ ని కట్టిపడేసే విజువల్స్ ని జోడించడం ప్రధాన ఎస్సెట్ గా మారిందట. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 73.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 75 కోట్లు రాబట్టాల్సిందే. గతడిచిన ఆరు రోజుల్లో రూ. 51 నుంచి 55 కోట్ల మేర షేర్ ని రాబట్టింది. అంటే మరో రూ. 20 కోట్లు రాబట్టగలిగితే సినిమా సూపర్ హిట్ అవుతుంది.
రానున్న రోజుల్లో `విక్రాంత్ రోణ`కు ఇది సాధ్యమవుతుందా అన్నదే ఇప్పడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆగస్టు 5న రెండు క్రేజీ సినిమాలు విడవుదలవుతున్నాయి. కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార`. దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపూడి రూపొందించిన `సీతారామం` విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమా టాక్ ని బట్టే `విక్రాంత్ రోణ` తన టార్గెట్ ని రీచ్ అవుతుందా? లేదా అన్నది తేలనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.