Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ ను చూసి వాత పెట్టుకుంటున్న విక్రాంత్‌ రోనా?

By:  Tupaki Desk   |   21 July 2022 1:30 AM GMT
కేజీఎఫ్‌ ను చూసి వాత పెట్టుకుంటున్న విక్రాంత్‌ రోనా?
X
సౌత్ సినిమాల్లో తెలుగు మరియు తమిళ సినిమాలు మాత్రమే వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతాయి.. వందల కోట్ల వసూళ్లను రాబడుతాయి అనే అభిప్రాయం కేజీఎఫ్ కు ముందు వరకు ఉండేది. ఎప్పుడైతే కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చిందో అప్పటి నుంచి బాలీవుడ్ సినిమా లకు కన్నడ సినిమాలు ఏ మాత్రం తీసిపోవు అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇక  కన్నడ నుండి రాబోతున్న ప్రతి సినిమా కూడా కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుందని.. మరిన్ని కేజీఎఫ్ సినిమా లు కన్నడం నుంచి రాబోతున్నాయి అంటూ సినీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి సినిమా కూడా వందల కోట్ల వసూళ్లను రాబడుతోంది అనుకుంటే అది అతి విశ్వాసం అవుతుంది. కనుక విడుదల విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన కేజీఎఫ్ సినిమా ను చూసి తాము ఏమాత్రం తక్కువ కాదు అనుకుని ముందు వెనుక చూడకుండా విడుదల అయితే బొక్క బోర్లా పడటం ఖాయం. పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలి అనుకున్నప్పుడు అన్ని భాషల్లో ఆ వారంలో విడుదల అవ్వబోతున్న సినిమాలకు సంబంధించిన అవగాహన ఉండాలి.

ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా ఆ భాషలో సినిమా బొక్క బోర్లా పడటం ఖాయం. ఆ విషయాన్ని ఈగ విలన్‌ సుదీప్ నటించిన విక్రాంత్‌ రోనా మేకర్స్ పట్టించుకోవడం లేదు అంటున్నారు. వచ్చే వారం విడుదల కాబోతున్న విక్రాంత్‌ రోనా కు పెద్ద సినిమాల నుంచి పోటీ తప్పేలా లేదు. తెలుగు లోనే ఈ సినిమా కు పెద్ద పోటీ ఉంది.

హీరోగా సుదీప్‌ కు టాలీవుడ్‌ లో పెద్దగా సక్సెస్ లు లేవు. అయినా కూడా వంద కోట్లకు పైబడిన బడ్జెట్‌ తో రూపొందిన విక్రాంత్ రోనా సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా కాస్త ఎక్కువ వసూళ్లను తెలుగు ప్రేక్షకుల నుంచి ఆశిస్తున్నారు. కాని పోటీ ఉండడం వల్ల ఎంత వరకు ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది అనేది అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు విక్రాంత్‌ రోనా సినిమా కు ఇప్పటి వరకు పెద్దగా బజ్ క్రియేట్‌ చేయలేక పోయింది. అయినా కూడా భారీగా విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ను మొదలు పెట్టలేదు. విడుదలకు సమయం తక్కువ ఉన్నా కూడా ఇంకా హడావుడి మొదలు కాకపోవడంతో కేజీఎఫ్‌ స్థాయిలో విక్రాంత్‌ రోనా వసూళ్లు సాధించే అవకాశం తక్కువ అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.