Begin typing your search above and press return to search.

ఆ గ్రామం గుండెల్లో కొలువైన రియల్ ‘హీరో’

By:  Tupaki Desk   |   11 May 2020 9:50 AM GMT
ఆ గ్రామం గుండెల్లో కొలువైన రియల్ ‘హీరో’
X
ఒక హీరో మరణించాడు.. నటనకు పర్యాయపదమైన అతడు తెరపైనే కాదు.. బయట కూడా ఎన్నో మంచి పనులు చేశాడు. ఆపదలోని వారిని ఆదుకున్నాడు. మతం లేదంటూ అందరినీ ఒక్కగాటిన చూశాడు. ఇప్పుడు అతడు లేకున్నా ఆయన చేసిన మంచి పనులు ఇంకా ఆయనను బతికిస్తూనే ఉన్నాయి.

బాలీవుడ్ విలక్షణ నటుడు ‘ఇర్ఫాన్ ఖాన్’ ఇటీవలే అంతుచిక్కని రోగంతో అసువులు బాసాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన ఇర్ఫాన్ ఖాన్ లో మానవత్వం ఎక్కువ అని చాలాసార్లు నిరూపితమైంది.

ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా లేకపోయినా..ఆ గ్రామం గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉన్నాడు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఇర్ఫాన్ అంటే ఆ గ్రామస్థులకు ఎనలేని అభిమానం. రియల్ హీరోగా నిలిచాడు.

మహారాష్ట్రలోని ఇగత్ పురి గ్రామస్థులంతా ఇర్ఫాన్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇర్ఫాన్ జ్ఞాపకంగా తమ ఊరి పేరును ‘హీరో చి వాడీ’ అని పేరు పెట్టేశారు.

ఇగత్ పురి గ్రామంలోని నిరుపేద కుటుంబాల్లోని పేద విద్యార్థులను ఇర్ఫాన్ చదివించాడు. చదువుకోలేని వారందరినీ చేరదీశాడు. ఆ ఊరికి కష్టసమయంలో ఇర్ఫాన్ ఆదుకున్నాడు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ సదుపాయాలు.. అంబులెన్స్ వంటి సౌకర్యాలు గ్రామానికి కల్పించారు. వారాంతంలో ఆ ఊళ్లో ఉండడానికి ఇర్ఫాన్ అక్కడే ఒక ప్లాట్ కొన్నాడు. ఎంతో మంది కుటుంబాలకు పెద్దగా ఎన్నో సేవలు చేశాడు. నోటు పుస్తకాలు, రెయిన్ కోట్లు, స్వెట్లర్లను విద్యార్థులకు విరాళంగా అందించాడు.

ఇలా గ్రామానికి ఇంత చేసిన ఇర్ఫాన్ లేని లోటును ఆ గ్రామం జీర్ణించుకోలేకపోతోంది. ఆయనకు కన్నీటి నివాళులర్పిస్తూ తమ రియల్ హీరో అంటూ ఇర్ఫాన్ ను వారు కీర్తిస్తున్నారు.