Begin typing your search above and press return to search.
మెగా హీరో కంటే విలన్ కే ఎక్కువ పారితోషికం
By: Tupaki Desk | 27 Nov 2019 5:31 AM GMTమామూలుగా ఏ సినిమాను తీసుకున్న ఎక్కువ శాతం హీరో పారితోషికం అధికంగా ఉంటుంది.. ఆ తర్వాత హీరోయిన్ ఇతర నటీనటుల పారితోషికాలు ఉంటాయి. చాలా రేర్ ఆ హీరోయిన్ పారితోషికం కంటే విలన్ పారితోషికం అధికంగా ఉంటుంది. కాని మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న 'ఉప్పెన' సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న విజయ్ సేతుపతి పారితోషికం హీరో కంటే ఎక్కువ అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
మైత్రి మూవీస్ లో నిర్మాణం జరుగుతున్న ఉప్పెన సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఆయన చేస్తున్నది విలన్ రోల్ అయ్యి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. కాని ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఉప్పెన సినిమా ప్రారంభం సమయంలో ఆయనకు 2.5 కోట్ల పారితోషికంను మాట్లాడారట. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడం.. విజయ్ సేతుపతి డేట్లు ఎక్కువ కావాల్సి రావడంతో పాటు ఆయనకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడటంతో మరో కోటిన్నర వరకు పారితోషికంను పెంచారట. అంటే మొత్తంగా ఉప్పెన సినిమా పేరు మీద విజయ్ సేతుపతికి నాలుగు కోట్ల పారితోషికంను నిర్మాతలు ముట్టజెప్పుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
వైష్ణవ్ తేజ్ కొత్త హీరో కనుక ఆయనకు ఆ స్థాయిలో పారితోషికం ఉండి ఉండదని.. విజయ్ సేతుపతికి ఇస్తున్న దానికంటే కూడా తక్కువే ఉంటుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విజయ్ సేతుపతికి అత్యంత కీలకమైన పాత్ర ఉంటుంది. హీరో తర్వాత అత్యధిక స్క్రీన్ స్పేస్ ఉన్న నటుడు కూడా ఆయనే అవ్వడం వల్ల అంతగా ఆయనకు పారితోషికం ఇస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఉప్పెన సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.