Begin typing your search above and press return to search.

హీరోల విలన్ వేషాలు

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:30 AM GMT
హీరోల విలన్ వేషాలు
X
మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రేక్షకుల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి అని చెప్పాలి. ఇక కమర్షియల్ సినిమాలకు ముగింపు పలికి కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం వచ్చింది అని కొంత మంది హీరోలకు కూడా చాలా క్లారిటీ గా అర్థమైంది. ఏ పాత్ర చేసినా కూడా మునుపెన్నడూ చేయని విధంగా ఉండాలి అనే విధంగా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం అనేది కూడా సినిమాలకు చాలా పాజిటివ్ గా మారింది అలాంటి క్యారెక్టర్స్ ను జనాలు చాలా ఫాస్ట్ గా నే కనెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది హీరోలు అదే తరహాలో నెగిటివ్ పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ ట్రెండ్ ను రానా దగ్గుబాటి బాహుబలి తో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వెంకటేష్ కూడా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. నెట్ ఫ్లెక్స్ సంస్థతో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ రానా నాయుడు సినిమాలో వెంకటేష్ పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల సూర్య కూడా కమల్ హాసన్ సినిమాలో రోలెక్స్ గా నెగిటివ్ పాత్రలో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే సూర్య 24 సినిమాలో విలన్ గా కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇలాంటి నెగిటివ్ పాత్రలు సూర్యకు కొత్త కాదు. ఇక విక్రమ్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో సూర్య పాత్రను కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. విలన్ మీద కోపంతో కొన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనే పుష్ప రాజ్ నెగటివ్ షేడ్స్ లో షాక్ ఇచ్చేలా సుకుమార్ హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆఖరికి రవితేజ కూడా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ స్టూవర్టుపురం గజదొంగ గా కనిపించబోతున్నాడు. ఇక దొంగగా కనిపించాలి కాబట్టి అతనిలో నెగిటివ్ షేడ్ ను కూడా బలంగా చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. మరి ఈ విలన్ వేశాలతో హీరోలు ఎంతవరకు క్లిక్కవుతారో చూడాలి.