Begin typing your search above and press return to search.

విలనీల వేడి తగ్గిందా?

By:  Tupaki Desk   |   19 Sep 2015 7:30 PM GMT
విలనీల వేడి తగ్గిందా?
X
మన సినిమాలలో హీరో నాయకుడిగా ఎదగాలంటే దానికి ధీటైన ప్రతినాయకుడిని సృష్టించి, ప్రేక్షకులకు అతనంటే కోపం తెప్పించి, హీరో చేత మట్టి కరిపించాలి. అంటే హీరోయిజం పండడానికి విలనిజం ఒక విధంగా వెన్నుముక లాంటిది. అలాంటి విలనిజాన్ని నిజంగా మన కళ్ళకు కట్టిన విలనీలు ఎందఱో టాలీవుడ్ లో మెరిసారు. అయితే ప్రస్తుతం మన తెలుగు సినిమాకు విలన్ల కొరత ఏర్పడింది.

ఒక సినిమా స్క్రిప్ట్ దశలో వున్నప్పుడు హీరోని తేలిగ్గా అంచనా వేయగలుగుతున్న నేటి దర్శకులు విలన్ పాత్ర ఎవరికి కట్టపెట్టాలి అన్న అంశంపై 100శాతం కాన్ఫిడెన్స్ చూపలేకపోతున్నారు. ముకేష్ రుషి - జయప్రకాష్ రెడ్డి ల తరువాత నయా తరంలో విలన్ లగా ప్రఖ్యాతిపొందినవారు చాలా తక్కువే. అరుంధతితో సోనూ సూద్ వంటి నాణ్యమైన ప్రతినాయకుడు దొరికినా ప్రస్తుతం టాలీవుడ్ - బాలీవుడ్ చక్కర్లు కొడుతున్నాడు. ప్రదీప్ రావత్ (భిక్షు యాదవ్) సడన్ గా కనుమరుగైపోయాడు. ఇక సుప్రీత్ అందరి హీరోల బాడీలకు సెట్ అయ్యే విలన్ కాడు. కిల్ కిల్ బాష దనచేసిన ప్రభాకర్ కూడా ఈ కోవకే చెందుతాడు. చిన్న చిన్న హావభావాలతో విలనిజాన్ని చూపించడం కాస్త కష్టతరమైన అంశమే.

విలక్షణ విలనీలు గా నేటి తరంలో రావు రమేష్ - తాజాగా జగపతిబాబు పేర్లు తెచ్చుకున్నారు. జిల్ తో మెప్పించిన కబీర్ ఒకేసారి రెండు పెద్ద సినిమాలలో ఛాన్స్ కొట్టేశాడంటే విలన్ల కొరత ఏ రేంజ్ లో వుందో అర్ధమవుతుంది. బాలీవుడ్ నుండి అడపాదడపా ఈ రోగ్ బ్యాచ్ దిగుతున్నా అంతగా ఎవరూ ప్రభావం చూపకపోవడం గమనార్హం.